తెలుగులో అరుదైన రికార్డు సృష్టించిన కాంతారా..!

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కాంతార సినిమా రికార్డును బద్దలు కొట్టేలా కనిపిస్తున్నది. అక్టోబరు లో తెలుగులోనే కాకుండా పలు భాషలలో విడుదలయ్యింది. విడుదల అయిన అన్ని భాషల్లో కాంతార సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కన్నడలో మాత్రం సెప్టెంబర్ 30న విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. కాంతారా సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఒక్క టాలీవుడ్ లో మాత్రమే రూ. 65 కోట్ల కలెక్షన్లు జరిగినట్టు సమాచారం.. ఇక కర్ణాటకలో అయితే చెప్పనవసరమే లేదు.. ఈ సినిమా చూడని ప్రేక్షకులంటూ ఎవరూ లేరు..అలాగే ఆ రాష్ట్రాలలో ఏకంగా రూ.175 కోట్ల రూపాయలు ఈ సినిమా వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగులో కలెక్షన్లు చూస్తుంటే అత్యధికంగా వసూలు చేసిన డబ్బింగ్ సినిమా జాబితాలో కాంతార చేరింది.

Kantara - Telugu' Gains Glory With Rave Receptions! - Movie News

మొన్న వచ్చిన కేజిఎఫ్ -2 సినిమాకి తెలుగులో రూ 185 కోట్లును కలెక్షన్ సాధించింది. ఆ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో, రోబో 2.0 చిత్రం రూ.100 కోట్లను సాధించింది. ఇక తాజాగా కాంతారా సినిమా 65 కోట్లను సాధించింది. అంతేకాకుండా ఈ సినిమా నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత విక్రమ్ నటించిన ‘ఐ’సినిమా రూ. 57 కోట్లతో 5 వ స్థానంలో నిలిచింది. అయితే థియేటర్లలో సందడి చేస్తున్న కాంతారా సినిమా చాలాచోట్ల 50 రోజులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

Kantara review: Rishab Shetty's retelling of folklore is highly imaginative  and immersive | Entertainment News,The Indian Expressఓవరాల్ గా కాంతారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ 350 కోట్లను కలెక్షన్ చేసిన ఈ మూవీ వచ్చేవారం ఓటీటి లో విడుదల కాబోతున్నట్లుగా సమాచారం. అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 24 నుంచి కాంతార స్ట్రిమింగ్ కాబోతున్నట్లుగా ఆమెజాన్ హెల్ప్ లైన్ నుంచి ఒక ట్విట్టర్ రావడం జరిగింది.కాంతార కలెక్షన్లని చూస్తున్న సౌత్ ఇండియా హీరోలు నెవ్వరపోతున్నారు. కాంతార అనేది ఒక చిన్న సినిమా అది కన్నడలో తప్ప సౌత్ లో ఎవ్వరికీ తెలియని హీరో రిషబ్ శెట్టి ఈయన హీరోనే కాకుండా దర్శకుడుగా చేసింది తక్కువ సినిమాలే అయినా… అయితే ఈ మూవీ ఇంత పెద్ద హిట్ సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

Share post:

Latest