టబు పై ప్రశంసలు కురిపించిన కంగనా రనౌత్..!!

బాలీవుడ్ హీరోయిన్ కంగానా రనౌత్ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది. బాలీవుడ్ లో ఉండే పలు వార్తల పైన స్పందిస్తూ ఎప్పుడు వివాదాస్పందంగా మారుతూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి బాలీవుడ్ సినిమాలు, దక్షిణాది హిట్లపైన కూడా స్పందిస్తూ ఉంటుంది. రీసెంట్గా కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా చిత్రాన్ని చూసి ఈ చిత్రం పైన ప్రశంసల వర్షం కురిపించింది కంగానా రనౌత్. ఇక ఈ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహించడం మరింత హైలెట్గా నిలిచిందని చివరి 15 నిమిషాలు తనకొక సరికొత్త అనుభూతిని కలిగించిందని తెలియజేసింది.

Kangana Ranaut Is All Appreciative About Tabu, Lauding Her Says She Has Been Slaying Even In Her 50sఅయితే ఇప్పుడు తాజాగా సీనియర్ హీరోయిన్ టబు పైన పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్ద తో పాటు పలు సినిమాల పైన కామెంట్లు చేసిన కంగన తాజాగా టబు పై ప్రశంసల వర్షం కురిపించింది. 50 ఏళ్ల వయసులో కూడా టబు ఒంటిచేత్తో హిందీ చిత్రాన్ని బతికిస్తోందంటూ కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఆసక్తికరమైన పోస్టుని షేర్ చేసింది.

ఈ ఏడాది రెండు హిందీ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద బాగా ఆకట్టుకున్నాయి. అందులో భూల్ భూలయ్యా , దృశ్యం-2 సినిమాలు విడుదలై మంచి సూపర్ హిట్టుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాలలో టబు ప్రధాన పాత్రలో నటించింది. దీంతో ఈ వయసులో కూడా ఒంటరిగా హిందీ చిత్ర పరిశ్రమను కాపాడుతోందంటూ కంగానా కామెంట్లు చేస్తోంది. ఈమె ప్రతిభను ఎవరు కూడా ప్రశంసించలేరు.. 50 ఏళ్ల వయసులో కూడా స్టార్ గా నిలవడం మాత్రం ఒక అద్భుతం అని కంగానా రనౌత్ తెలియజేస్తోంది.

Share post:

Latest