తెగ కష్టపడి పోతున్న కళ్యాణ్ రామ్.. అందుకేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరికొత్త ప్రయోగాలకు ఎప్పుడు శ్రీకారం చుడుతూ ఉంటారని చెప్పవచ్చు. మొదటిసారిగా 3d సినిమానీ తెలుగు తెరకు తీసుకొచ్చిన ఘనత కళ్యాణ్ రామ్ కి దక్కింది. అయితే కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఇప్పటివరకు అతనొక్కడే ,పటాస్, హరే రామ హరే కృష్ణ ,118 చిత్రాల తర్వాత మళ్లీ అంతటి విజయాన్ని అందుకున్న చిత్రం బింబిసారా. ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన చిత్రం కావడంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచిందని చెప్పవచ్చు.

Nandamuri Kalyan Ram's next to be a pan Indian film titled Devil; Makers  release the first look | PINKVILLAబింబి సార సినిమాలోని కళ్యాణ్ రామ్ నటన అద్భుతంగా ఉందని సినీ ప్రేక్షకుల సైతం తెలియజేశారు. ఇప్పుడు తాజాగా మరొకసారి సోషల్ మీడియాలో తన ఫిట్నెస్ తో అభిమానులను సైతం ఆసక్తి పరుస్తున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా డేవిడ్ మోడ్ లో కనిపించారు. బింబిసార విజయం సాధించడంతో మరొకసారి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలో ఆమీగోస్ అనే సినిమాతో మ్యాజిక్ చూపించడానికి తాను చాలా ఆసక్తికరంగా వేచి చూస్తున్నాను అంటూ తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు.

ఇకపోతే కళ్యాణ్ రామ్ చేతిలో డెవిల్ అనే పాన్ ఇండియా చిత్రం కూడా ఉన్నది. ఈ చిత్రంలో ఒక చీకటి రహస్యాన్ని చేదించే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కనిపించబోతున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే దిల్ రాజ్ ప్రొడక్షన్లో కెవి గుహన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. అలాగే బింబిసార సినిమా సీక్వెల్లో కూడా నటిస్తూ ఉన్నారు. ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం సినిమాల కొసం మా హీరో ఇంత కష్టపడుతున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం కళ్యాణ్ రామ్ షేర్ చేసిన ఒక ఫోటో నెట్టింట వైరల్ గా మారుతోంది.

Share post:

Latest