కాజల్ అగర్వాల్ అందాల ప్రదర్శన నేడే చూడండి.. ఆలోచించిన ఆశాభంగం!

అందాల చందమామ, ప్రముఖ తెలుగు నటి కాజల్ గురించి తెలియని తెలుగు కుర్రకారు ఉండరంటే నమ్మితీరాలి. ఓ దశాబ్దం పాటు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన కాజల్, వివాహం అనంతరం కాస్త నెమ్మదించని చెప్పుకోవాలి. వివాహం, ఆ వెంటనే ప్రెగ్నన్సీ రావడంతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది. ఇక ఇటీవల కాజల్ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి విదితమే. కాగా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్ ను ప్రారంభించడం కోసం మళ్లీ జోరు పెంచుతోంది ఈ అందాల చందమామ.

మొదటి లాక్ డౌన్ సమయంలోనే అనగా, 2020 అక్టోబర్ 6న ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి గౌతమ్ కిచ్లును కాజల్ పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ముంబైలో జరిగిన వీరి వివాహానికి స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. లాక్ డౌన్ కావడంతో చాలా సింపుల్ గా పెళ్లి కానిచ్చేశారు. ఇకపోతే ఈ ఏడాది ఏప్రిల్ 19న బేబీ బోయ్ ‘నీల్ కిచ్లు’కు జన్మనిచ్చి మాతృతనాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే పెళ్లి, ప్రెగెన్సీతో రెండేండ్లు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్ ప్రస్తుతం మళ్లీ స్పీడ్ పెంచుతోంది.

అవును, కాజల్ ఇపుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన అభిమానులకు క్రేజీ అప్డేట్స్ అందిస్తూ ఖుషీ చేస్తోంది. కాజల్ తాజాగా డ్యూయల్ రోల్ పోషించిన తమిళ్ హార్రర్ చిత్రం పేరు ‘గోస్టీ’ (Ghosty). ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ జనాలను భయపెట్టనుంది. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి అప్డేట్స్ వదులుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో అమ్మడు రకరకాల ఫోటో షూట్స్ పిక్స్ షేర్ చేసి అందాల కనువిందు చేస్తోంది. సదరు ఫొటోల్లో కాజల్ వింటేజ్ లుక్ ను సొంతం చేసుకుంది.

Share post:

Latest