పులిహోర రాజ పరువు తీసేసిన కొత్త యాంకర్..అంత మాట అనేసింది ఏంట్రా బాబు..!!

బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంత క్రేజ్ ని సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా స్టార్ట్ అయిన ఈ షో దాదాపు 10 ఏళ్ల నుంచి బ్రేక్ లేకుండా జనాలను నవ్విస్తుంది . ఎప్పటికప్పుడు సరికొత్త కమెడియన్స్ తీసుకొస్తూ కడుపుబ్బ నవ్విస్తున్న జబర్దస్త్ షో ..ఈ మధ్యకాలంలో ఎన్నో కాంట్రవర్షియల్ మ్యాటర్స్ లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే . కాగా జబర్దస్త్ నుండి ఒక్కొక్కరుగా కంటెస్టెంట్స్ ,జడ్జెస్, యాంకర్ లు బయటకు వచ్చేస్తున్న తరుణంలో జబర్దస్త్ మేనేజ్మెంట్ కూడా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది .

పాత చింతకాయ పచ్చడి లాగా పాత వాళ్ళని చూపించకుండా.. కొత్త అందాల రుచి చూపించాలని జబర్దస్త్ షో కి కొత్త యాంకర్ ని తీసుకొచ్చింది. ఆ యాంకరమ్మ పేరే సౌమ్య. చూడడానికి చాలా హాట్ గా ఉండే ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దది . కాగా యాంకర్ గా చేస్తున్న సౌమ్య తనదైన స్టైల్ లో జనాలను కట్టిపడేస్తుంది. రీసెంట్గా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది . నవంబర్ 17కి సంబంధించిన జబర్దస్త్ ప్రోమో ని మల్లెమాల రిలీజ్ చేసింది. ఈ క్రమంలోని షోలో ఎప్పుడు హైపర్ యాక్టివ్ గా ఉండే హైపర్ ఆది కొత్త యాంకర్ పై పంచెస్ వేయడానికి రెడీగా ఉన్నాడు .

అయితే ఎట్టకేలకు హైపర్ ఆది నోటికి తాళం వేసింది యాంకర్ సుమయ . వల్గర్ పంచెస్ తో నాన్న రచ్చ చేసే హైపర్ ఆది.. సౌమ్య దగ్గరకు వెళ్లి “నువ్వు ఒక్కదానివి బుట్ట బొమ్మ సాంగ్ డాన్స్ వేస్తే ఏం బాగుంటుంది ..నాతో కలిసి చేస్తే నిజంగానే బుట్ట బొమ్మ అవుతుంది “అంటూ చెప్తాడు దానికి యాంకర్ కౌంటర్ ఇస్తూ..” మీరు ఎంత పులిహోర కలిపినా నేను మీకు పడను వదిలేయండి “అంటూ చెబుతుంది .

అయితే చాలెంజ్ నేను చిరంజీవి ఫ్యాన్ ని తెలుసా అంటూ ఆది ఓవరాక్షన్ చేస్తాడు ..దీనికి డబుల్ కౌంటర్ ఇస్తూ చిరంజీవి ఫ్యాన్ కానీ నువ్వు చిరంజీవి కాదుగా అంటూ ఆది గాలి తీసేసింది. దీంతో అక్కడ ఒక్కసారిగా అరుపులు కేకలు వినిపిస్తాయి . అంతేకాదు జడ్జిగా చేసిన కృష్ణ భగవాన్ సైతం సౌమ్య పై పంచెస్ వేయడం ఈ ప్రోమోలోకి హైలెట్గా మారింది. ఏది ఏమైనా సరే ఇన్నాళ్లకు హైపర్ ఆది నోటికి తాళం వేసే యాంకర్ దొరికేసింది అంటూ జనాలు చెప్పుకుంటున్నారు.

 

Share post:

Latest