జాక్ పాట్ కొట్టేసిన జబర్దస్త్ కొత్త యాంకరమ్మ..!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో కామెడీ షోలలో జబర్దస్త్ కామెడీ షో కూడా ఒకటి. గత 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ షో కి మంచి టిఆర్పి రేటింగ్ రావడమే కాకుండా ఎంతోమంది కమెడియన్స్ కూడా పరిచయమవుతున్నారు. ఆ కమెడియన్స్ తమ టాలెంటును నిరూపించి సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకోవడం గమనార్హం. ప్రస్తుతం జబర్దస్త్ నుంచి గతంలో జడ్జిలుగా వ్యవహరించిన నాగబాబు, రోజా వెళ్ళిపోయారు. ఆ తర్వాత యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ కూడా వెళ్లిపోవడంతో ఆస్థానాన్ని రష్మి భర్తీ చేశారు. కానీ ఇప్పుడు రష్మీకి కాల్ షీట్స్ సరిపోకపోవడంతో కొత్త యాంకర్ ను తీసుకొచ్చారు మల్లెమాల నిర్వాహకులు.Soumya Rao Remuneration : జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యా రావు రెమ్యునరేషన్  ఎంతో మీకు తెలుసా - jabardasth new anchor soumya rao remuneration details  here goes viral , Jabardasth Show , Soumya Rao , new

ఈ క్రమంలోనే శ్రీమంతుడు సీరియల్ ద్వారా సత్య క్యారెక్టర్ లో తెలుగు ఆడియన్స్ కు బాగా పరిచయస్తురాలైన సౌమ్యరావును జబర్దస్త్ కొత్త యాంకర్ గా తీసుకొచ్చారు. ఈమె తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మంచి కామెడీ టైమింగ్ తో అలరిస్తోంది. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న ఈమె మాట తీరు చూసి ప్రేక్షకులు సైతం అట్రాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమోన్ విడుదల చేయగా అది బాగా పాపులర్ అయ్యింది. ఈ క్రమంలోనే కొత్త యాంకర్ కు ఎంత పారితోషకం ఇస్తున్నారు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.Sowmya rao radig tamil tv nenjam marappathillai serial actress hot  transparent saree - YouTube

కన్నడ సీరియల్ నటి, న్యూస్ రిపోర్టర్ , తెలుగు సీరియల్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సౌమ్యారావు అప్పటికే భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రతి గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ ఎపిసోడ్ కి ఇప్పుడు యాంకర్ గా అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఈమెకు ప్రతి ఎపిసోడ్ కు సుమారుగా సుమారుగా 1.5 లక్షల రూపాయలు ఇస్తున్నారట. దీన్ని బట్టి చూస్తే సీరియల్స్ ద్వారా రోజుకు రూ. 20,000, రూ.30,000 తీసుకునే సౌమ్యారావు ఇలా జబర్దస్త్ తో ఒక్క ఎపిసోడ్కే ఇంత అమౌంట్ తీసుకోవడం అంటే జాక్ పాట్ కొట్టినట్టే కదా.. ఏది ఏమైనా ఈమె పాపులారిటీతో పాటు పారితోషకం కూడా బాగా పెరిగిపోతుందని చెప్పవచ్చు.

Share post:

Latest