నాగార్జున కెరీర్నే మార్చేసిన ఈ సినిమా వెనుక ఇంత కథ ఉందా..!!

టాలీవుడ్ లో మన్మధుడుగా పేరుపొందారు నాగార్జున ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. నాగార్జున ఎన్నో చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తన వందవ చిత్రానికి సంబంధించి సినిమాని తెరకెక్కించడానికి పలు సన్నహాలు చేస్తూ ఉన్నారు. అయితే నాగార్జున తన కెరీర్నే మార్చేసిన ఒక సినిమా గురించి తాజాగా విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

Geethanjali' (1989)

టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు విడుదలైనప్పుడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోలేకపోయినా ఆ తర్వాత స్లోగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అయిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అలాంటి చిత్రాలలో నాగార్జున నటించిన గీతాంజలి సినిమా కూడా ఒకటి. ఈ తరం ప్రేక్షకులకు గీతాంజలి ఒక క్లాసికల్ మూవీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మణిరత్నం తెలుగులో తెరకెక్కించిన చిత్రం ఇది ఒక్కటే అని తెలుస్తోంది. ఇందులో కొత్త హీరోయిన్ గిరిజ మొదటిసారి ఈ సినిమాలోని నటించింది. ఈ చిత్రంలో గిరిజ ఎంతో అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు.

Geetanjali (1989) Movie: Watch Full Movie Online on JioCinema

ఈ చిత్రం మొత్తం ఊటీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించగా ఇళయరాజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం ప్లస్ గా మారింది.ముఖ్యంగా హీరో ,హీరోయిన్కు క్యాన్సర్ అని తెలిసి మొదట ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయడానికి బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపలేదట. అంతేకాకుండా ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని బయ్యర్లు ముందుకు రాలేదట. అయితే ఈ సినిమాని విడుదల చేసిన నిర్మాత నరసారెడ్డి మాత్రం పలు సంచలన సృష్టిస్తుందని నమ్మి ఈ చిత్రాన్ని సొంతంగా రిలీజ్ చేశారు. దీంతో ఈ చిత్రం విడుదలైన మొదట రెండు వారాలు ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.కానీ ఆ తర్వాత నుంచి కలెక్షన్లు సైతం పలు రికార్డులను సృష్టించిందట. ముఖ్యంగా ఈ చిత్రంలో ఉపయోగించిన డైలాగులు, పాటలు, డ్రెస్సులు అన్నీ కూడా పాపులర్ అయ్యాయట. ఇక కలెక్షన్ల పరంగా కూడా అత్యధికంగా సాధించినట్లు సమాచారం.

Share post:

Latest