హీరో రాజ్ తరుణ్ కెరియర్ ముగిసినట్టేనా..?

ఉయ్యాల జంపాల సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు హీరో రాజ్ తరుణ్. ముందుగా హీరోగా కంటే డైరెక్టర్ గా పనిచేయడానికి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ అనుకోకుండా హీరోగా మారిపోయారు. ఇక ఆ తర్వాత సినిమా చూపిస్త మావ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత కుమారి 21ఎఫ్ సినిమాతో యువ హీరోలలో స్టార్ గా ఎదిగారని చెప్పవచ్చు. ఇక తర్వాత రాజ్ తరుణ్ నటించిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక చివరిగా అనుభవించు రాజా, స్టాండ్ అప్ రాహుల్ సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

Raj Tarun lands into one more controversy
దీంతో రాజ్ తరుణ్ మార్కెట్ భారీగా పడిపోయిందని చెప్పవచ్చు. తను నటించిన ఎలాంటి సినిమా అయినా సరే థియేటర్లలో విడుదలవుతూ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రాజ్ తరుణ్ మార్కెట్ స్థాయి పూర్తిస్థాయిలో పడిపోవడంతో డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నారు. తను నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఆహనా పెళ్ళంట.. రాజేంద్రప్రసాద్ కెరీర్ ని మలుపు తిప్పిన ఈ సినిమా టైటిల్ తో రాజ్ తరుణ్ మొదటిసారిగా వెబ్ డ్రామాకు శ్రీకారం చుడుతున్నారు.

Aha Naa Pellanta' Teaser: Raj Tarun, Shivani Rajasekhar look promising! -  Telugu News - IndiaGlitz.com
ఇందులో హీరోయిన్గా శివాని రాజశేఖర్ నటిస్తూ ఉన్నది. ఈ వెబ్ సిరీస్ కు సంజీవరెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇక ఆమని, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం సినిమాలలో రాజ్ తరుణ్ కెరియర్ ముగిసినట్టేనా అని పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లతోనైనా ఓటీటి లో ప్రేక్షకులను అలరిస్తే సినిమాలలో అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు. ఇక ఇటీవలే ఎంతోమంది హీరో, హీరోయిన్లు కూడా ఓటీటి లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు. మరి రాజ్ తరుణ్ కెరియర్ ఇలా అయినా మలుపు తిరుగుతుందేమో చూడాలి.

Share post:

Latest