ఎన్టీఆర్ 30 వ సినిమా వచ్చేది అప్పుడేనా..?

జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్, కొరటాల శివ మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమాని డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ చేస్తూ ఉండడంతో ఈ సినిమా మరింత హైప్ పెరిగింది.ఇక అంతే కాకుండా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని చూస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పణలో, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. ఈ ఏడాది మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక డైలాగ్ మోషన్ టీజర్ ని విడుదల చేయడం జరిగింది.

Jr NTR unveils first motion poster of NTR 30 with Koratala Siva ahead of  39th birthdayఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ళింది లేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. ఈ ప్రాజెక్టు ప్రకటించి ఇప్పటికీ ఎన్నో నెలలు కావస్తున్న ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదనీ.. అంతేకాకుండా ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అంటూ అభిమానులకు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

NTR 30: Jr NTR and Koratala Siva's film announced ahead of the actor's  birthday. See motion poster – Hindisip

ఇక రీసెంట్ గా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ఒక ఫోటో షేర్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా త్వరలోనే లాంచింగ్ ప్రారంభం కాబోతోందని సమాచారం. డిసెంబర్ లేదా జనవరి నెలలో ఈ సినిమా షూటింగును మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest