చైతూతో శోభిత‌ డేటింగ్ నిజ‌మే.. ఒక్క ఫోటోతో బండారం బ‌య‌ట‌ప‌డింది!?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల డేటింగ్ లో ఉన్నారంటూ కొద్ది రోజుల క్రితం నెట్టింట జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సమంతతో విడిపోయిన కొద్ది నెలలకే నాగచైతన్య శోభిత ప్రేమలో పడ్డాడని, వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకునే అవకాశాలు సైతం ఉంటాయని వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై నాగచైతన్య స్పందించకపోయినా.. శోభిత మాత్రం ఖండించింది. నెట్టింట జరుగుతున్న ప్రచారం అవాస్తమని తెలిపిన శోభిత.. చైతుతో తనకంత పరిచయం కూడా లేదని తెలిపింది. అక్కడితో చైతు శోభితల డేటింగ్ ప్రచారం సద్దుమణిగింది. అయితే మళ్లీ ఇప్పుడు ఏ వ్యవ‌హారం తెరపైకి వచ్చింది. నాగచైతన్యతో శోభిత డేటింగ్ చేస్తున్నది నిజమే అంటూ వార్తలు ఊపందుకున్నాయి.

అందుకు కారణం లేకపోలేదు. నాగచైతన్య శోభిత కలిసి పక్క పక్కనే నిల్చొని దిగిన ఫోటో రెండుగా కట్ చేసి ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. ఒక విదేశీ టూర్లో ఇద్దరు ఫోజు ఇచ్చినట్లుగా ఈ ఫోటో కనిపిస్తోంది. ప్రస్తుతం కట్ చేసిన ఈ రెండు ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసి శోభిత చైతు డేటింగ్ బండారం బయటపడింది అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై చైతు-శోభిత‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Share post:

Latest