అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో సక్సెస్ అయ్యారా..!!

అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా పై ప్రేక్షకుల అభిప్రాయం ,అభిమానుల అభిప్రాయం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం.

కథ విషయానికి వస్తే శ్రీనివాస శ్రీపాద (అల్లరి నరేష్) ఒక గవర్నమెంట్ టీచర్గా పని చేస్తూ ఉంటారు. అలా ఒకసారి ఎలక్షన్ డ్యూటీకి మారేడుమిల్లి గ్రామానికి వెళ్లడం జరుగుతుంది. అయితే అసలు ఆ గ్రామం ఉందని అది దేశంలో భాగమని కూడా ఎవరికీ తెలియదు. సమాజానికి దూరంగా బతుకుతున్న మారేడుమిల్లి తండా ప్రజల, కష్టాలను అక్కడ జరుగుతున్న అన్యాయాలను శ్రీనివాస్ శ్రీపాద ప్రపంచానికి తెలియజేయాలనుకుంటారు.. కానీ అందుకోసం ఒక వ్యవస్థ మీద పోరాటం చేయడం జరుగుతుంది. చివరికి ఈ పోరాటంలో శ్రీనివాస్ శ్రీపాద గెలిచారా లేదా అన్న కథాంశంతో విచిత్రాన్ని తెరకెక్కించారు.

ఆ సినిమాకు రీమేక్ అంటూఅల్లరి నరేష్ మరొకసారి ఈ చిత్రంలో సీరియస్ రోల్ చేశారు. గతంలో ఎన్నో సినిమాలలో కామెడీ పాత్రలో నటించిన అల్లరి నరేష్ ఆ ఫార్మాట్ అంతగా కలిసి రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.అందుచేతనే ఇలాంటి సబ్జెక్ట్ ఉన్న కథ లను ఎంచుకుంటూ ఉంటున్నారు. అయితే టాక్ వినిపిస్తున్న ప్రకారం మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో అల్లరి నరేష్ ఆకట్టుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పలు విషయాలను కళ్ళకు కట్టినట్టుగా డైరెక్టర్ చూపించారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరొకసారి అల్లరి నరేష్ తన నటనతో ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సపోర్టింగ్ రోల్ లో వెన్నెల కిషోర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. హీరోయిన్ నంది తన పాత్ర పరిధి మేర బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు మరొకసారి తన సత్తా చూపించారు అల్లరి నరేష.