Hombale: 3 చిత్రాలతో ఎన్ని కోట్లు లాభం పొందిందో తెలుసా..?

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా పలు చిత్రాలను నిర్మిస్తూ కొంతమంది పైకి ఎదుగుతూ ఉంటారు మరి కొంతమంది కనుమరుగవుతూ ఉంటారు. అలా వచ్చిన విజయంతో ఏది పడితే తీస్తే చివరికి కనుమరుగైన సందర్భాలు చాలా అని ఉన్నాయని చెప్పవచ్చు. కేవలం ఈ ఒక్కటి తెలిస్తే చాలు.. ఎప్పటికీ కింగ్ గానే ఉండవచ్చు అని చెప్పవచ్చు. అలా ఇప్పుడు కన్నడ నిర్మాణ సంస్థలలో హొంబేలె ఉందని చెప్పవచ్చు. ఈ నిర్మాణ సంస్థ అధినేత విజయ్ కరంగదూర్.

Hombale Films to reveal a surprise tomorrow | 123telugu.com

విజయ్ కరంగదూర్.. తన స్నేహితడు చలువే గౌడ తో కలిసి ఈ సంస్థను ప్రారంభించాడు. అయితే ఇప్పుడు శాండిల్ వుడ్ పరిశ్రమనే ఒక్కసారిగా మార్చేశారని చెప్పవచ్చు. పదేళ్ల క్రితం మొదలు పెట్టిన ఈ సంస్థ.. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు పెద్ద దిక్కుగా ఉండే వారిని సమాచారం. మొదట నిన్నందలే సినిమాతో ప్రొడక్షన్ ని ప్రారంభించగా ఈ సినిమా విజయం సాధించడంతో ఆ తర్వాత హీరో యష్ తో మాస్టర్ పీస్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో మళ్లీ పునీత్ రాజుతో రాజకుమారా సినిమా తీయగా అది మంచి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది.

KGF production company exciting update new announcement

ఇక అటు తరువాత పునీత్ తో యువరత్న సినిమాని తీస్తూ ఉన్న సమయంలోనే.. హీరో యష్ తో కే జి ఎఫ్ సినిమానీ ప్రారంభించారు. ఇక అటు తరువాత యువరత్న సినిమా మంచి విజయం సాధించడంతో కేజిఎఫ్ సినిమా కూడా విడుదలై మంచి సక్సెస్ సాధించింది. దీంతో ఊహించని విధంగా డబ్బు వచ్చిందని చెప్పవచ్చు. దీంతో విజయ్ చాలా జాగ్రత్త పడ్డారు. ఇక అప్పటినుంచి ఎలాంటి సినిమా అంటే అలాంటి సినిమా తీయకుండా మంచి కథలను చేయాలని నిర్ణయించుకున్నారట. అలా మూడేళ్ల పాటు ఏ సినిమా కూడా తీయలేదు కేవలం కేజీఎఫ్ 2తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించింది హొంబేలె. ఇక తాజాగా రిషబ్ శెట్టి అడిగారని కేవలం రూ. 15 కోట్లు కాంతారా సినిమా కోసం బడ్జెట్ను కేటాయించారట. ఇక ఈ సినిమా కూడా విజయం సాధించింది. అనుకోని విధంగా కలెక్షన్లు రాబట్టడం జరిగింది. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్, ఫహద్ ఫాజిల్ తో ధూమం, పృధ్విరాజ్ సుకుమారన్ తో టైసన్, రక్షిత్ శెట్టి తో రీఛార్జ్ ఆంటోని వంటి సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. దాదాపుగా చివరిగా విడుదలైన మూడు సినిమాలకు రూ.2000 కోట్ల రూపాయలు కలెక్షన్ లాభం చేసినట్లుగా సమాచారం.