హీరోయిన్ లైలా రీఎంట్రీ సక్సెస్ అయినట్టేనా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అందాల తార సొట్ట బుగ్గల సుందరి లైలా తెలుగు ప్రేక్షకులకు పరిచయస్తురాలే. మొదట దుష్మన్ దునియాకా అనే చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అటు తరువాత ఎగిరే పావురం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తన మొదటి సినిమాతోనే ఎంతోమంది ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేసింది ఈ భామ. ఆ తర్వాత మలయాళం, తమిళ్లో, ఉర్దూ, కన్నడ వంటి భాషలలో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. తన టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది లైలా.

Actress laila speech at sardar trailer launch event

అప్పట్లో యువతకు ఎక్కువగా ఫేవరెట్ హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది. అయితే కెరియర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలో లైలా ఇరానీ వ్యాపారవేత్త ముహద్దీన్ ను వివాహం చేసుకుంది. ఇక వివాహం తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది ఈ ముంబై బ్యూటీ. ఇక లైలాకు ప్రస్తుతం ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. అయితే సినీ ఇండస్ట్రీకి దూరమైన లైలా పదహారేళ్ల తర్వాత మళ్లీ ఇటీవల కార్తీ నటించిన సర్దార్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా రాశి ఖన్నా, రజిషా విజయన్ నటించారు.

ரொமான்ஸ் இருக்கு…அதுவும் இருக்கு… சர்தார் படத்தை தேர்வு செய்ய இதுதான்  காரணம் -லைலா.! – Cinebloopers | Tamil Cinema News | தமிழ் சினிமா செய்திகள்

ఇందులో కార్తీ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా అక్టోబర్ 21న తమిళంలో పాటు తెలుగులో కూడా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అందరికీ అనుకూలంగా ఉండడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టింది. చిత్రంలో లైలా సర్దార్ ఆశయం కోసం పోరాడే ఒక జర్నలిస్ట్ పాత్రలో నటించింది.

Karthi And PS Mithran Sardar Movie Twitter Review | సర్దార్ ట్విట్టర్  రివ్యూ.. హిట్ కొట్టేసిన కార్తీ News in Teluguఈమెను చూసిన అభిమానులు సైతం అప్పట్లో ఎంత అందంగా ఉందో లైలా ఇప్పటికీ కూడా అలాగే కనిపిస్తూ కుర్రకారుల మనసు దోచేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. లైలా పాత్ర ఉన్నది కొద్దిసేపైనా కూడా ప్రశంసలు అందుకుంది. దీంతో లైలా రియంట్రి బాగానే వర్కౌట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలలో నటిస్తుందేమో చూడాలి లైలా.

Share post:

Latest