బ్రేకింగ్‌: నాగ శౌర్య కి అస్వస్థత.. ఐదు రోజుల్లో పెళ్లి పెట్టుకుంటే ఇలా జ‌రిగిందేంటి?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యాడట. ఓ షూటింగ్ లో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కోప్పకూలి కింద పడిపోయార‌ట‌. దాంతో చిత్ర టీం హుటాహుటిన నాగశౌర్యను గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు.

ప్రస్తుతం నాగ‌శౌర్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల నాగశౌర్య తాను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూషా శెట్టితో శౌర్య ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతున్నాడు.

naga shourya
naga shourya

నవంబర్ 20వ తేదీన ఉదయం 11 గంటల 25 నిమిషాలకు నాగశౌర్య, అనూష‌ల వివాహం హిందూ సంప్రదాయ ప్రకారం జ‌ర‌గ‌బోతోంది. బెంగళూరులోని విటల్ మాల్యా రోడ్ లోని జెడబ్ల్యూ మారియోట్ హోటల్ నాగ‌శౌర్య పెళ్లి వేదిక కానుంది. అయితే మరో ఐదు రోజుల్లో నాగ శౌర్య పెళ్లి ఉండగా.. ఆయ‌న‌కు ఇలా జరగడం కుటుంబ సభ్యులు మ‌రియు సన్నిహితుల‌ను ఆందోళనకు గురి చేసింది. ఇక నాగ శౌర్య ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత క్లారిటీ రావాల్సి ఉంది.

Share post:

Latest