ఆస్పత్రిలో చేరిన హీరో అబ్బాస్.. కారణం ఏమిటంటే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు యూత్ ని బాగా అట్రాక్ట్ చేసిన హీరోలలో ప్రేమదేశం చిత్రం నటుడు అబ్బాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో కూడా పలు పాత్రలలో నటించి మెప్పించారు అబ్బాస్. ప్రేమదేశం చిత్రం ద్వారా తమిళ్, హిందీ తదితర భాషలలో కూడా మంచి పేరు సంపాదించారు. ప్రేమదేశం సినిమాలో నటించిన ప్రతి ఒకరి నటన కూడా ఎంతో అద్భుతంగా ఉండడమే కాకుండా అందరికీ పేరు సంపాదించిందని చెప్పవచ్చు. ప్రేమదేశం సినిమా తర్వాత అబ్బాస్ వరుసగా పలు చిత్రాలలో ఆఫర్లు అందుకున్నారు.

Abbas
కానీ ఆ తర్వాత సరైన సక్సెస్ లు రాలేకపోవడంతో అబ్బాస్ తెలుగు ,తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషలలో నటించిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. దీంతో 2015 వ సంవత్సరంలో తన సినీ కెరియర్ ని ఒక్కసారిగా బ్రేక్ తీసుకొని.. తన కుటుంబంతో కలిసి ఫారెన్ లో వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారు. అబ్బాస్ చివరిగా నటించిన చిత్రం బ్యాంక్. అయితే ఇప్పుడు తాజాగా అబ్బాస్ తన సోషల్ మీడియా నుంచి తాను సర్జరీ చేయించుకున్నారని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నానని స్వయంగా తానే తెలియజేయడం జరిగింది. అందుకు సంబంధించి పలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా చలామణి అయిన అబ్బాస్ ఆ తర్వాత వరుస సినిమాలతో ఫెయిల్యూరాయి.. చాలా సతమతమయ్యారు ఆ సమయంలోనే తన హీరోగా నెట్టుకు రావడం కష్టంగా భావించి తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. ప్రస్తుతం తన కుడికాలికి చేస్తా చికిత్స జరిగిందని తెలియజేశారు. తన బాగోగులు కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest