కృష్ణ మరణం ఇంత మందిని ఒంటరి చేసిందా..?

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక శకం ముగిసిపోయింది. ఆయన తోటి హీరోలు, సీనియర్ హీరోలు కూడా ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులయ్యారు. ఇక చివరిగా కృష్ణ మరణంతో వీరి శకం పూర్తయింది అని చెప్పాలి. ఇకపోతే కృష్ణ మరణం తర్వాత ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో మహేష్ బాబు తండ్రి మరణంతో ఒంటరివాడయ్యాడు అంటూ తెగ వార్తలు , పోస్టులు చేస్తూ ఉన్నారు. నిజానికి కృష్ణ మరణంతో ఒంటరి అయింది మహేష్ బాబు కాదు మృదుల అని చెప్పాలి. నిజానికి మహేష్ బాబుకి తల్లి ఇందిరాదేవి చనిపోయిన నెలకి తండ్రి చనిపోవడం నిజంగా బాధాకరం.. కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే ఒంటరి అయింది మాత్రం మహేష్ బాబు కాదు.

Ramesh Babu Wiki, Age, Death, Wife, Family, Biography & More - WikiBio

ఘట్టమనేని మృదుల.. ఈమె ఎవరు అని అనుకుంటున్నారా? ఈమె ఎవరో కాదు కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు భార్య మృదుల. రమేష్ భార్య అయినప్పటికీ కూడా ఏ రోజు ఆమె మీడియా ముందుకు రాలేదు. గొప్పింటి కోడలు ధర్పం చూపించలేదు. ఆమె భర్త ఆరోగ్యపరమైన ఇబ్బందులతో జనవరి నెలలో కన్నుమూస్తే.. ఆమె ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తోంది. కనీసం భర్త పోయిన తర్వాత అత్త మామ ఉన్నారన్న భరోసా ఉండేది.. కానీ ఇప్పుడు ఆ ఆశ పూర్తిగా కోల్పోయిందనే చెప్పాలి . పోయిన నెలలో ఇందిరా దేవి కన్ను మూసింది.. ఇప్పుడు కృష్ణ కూడా మరణించారు . ఇలా అటు భర్త, ఇటు అత్త, అటు మామ అందరూ స్వర్గస్తులవడంతో అందరినీ కోల్పోయి ఒంటరిగా మారిపోయింది మృదుల.

Ramesh Babu wife: రమేష్ బాబు భార్య ఎవరు.. ఎంతమంది పిల్లలు.. ఏం చేస్తుంటారు  తెలుసా..? | Here the interesting details about Super Star Mahesh Babu  brother late Ramesh Babu wife and children pk– News18 ...ఇక ఆమెకు ఒక కుమారుడు జయకృష్ణ మరియు కూతురు కూడా ఉన్నారు. వారు ఇంకా సెటిల్ అయినట్టుగా కనిపించడం లేదు. కానీ ఆమె ప్రపంచం మూగ పోయిన మహేష్ బాబు మాత్రం ఆమెకు ఒక కొడుకుగా అండగా నిలబడడం గమనార్హం. ఇక రమేష్ బాబు పిల్లలకు ఇంకా వివాహాలు కూడా జరగలేదు. ఈ పిల్లల బాధ్యతను మహేష్ బాబు తీసుకుంటారో లేదో చూడాలి.

Share post:

Latest