పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..హరిహర వీరమల్లు నుంచి తాజా అప్డేట్..!!

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో రెండువైపులా బిజీగా ఉన్నారు. దీంతో పలు సినిమా పనులు కూడా చాలా ఆలస్యంగా అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లోకి తిరిగి సెట్స్ మీదికి వెళ్ళింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా షెడ్యూల్ కోసం డైరెక్టర్ క్రిష్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ నందు పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్లుగా సమాచారం. ఇక లేటెస్ట్ షెడ్యూల్ మొదలు కాగా పవన్ కళ్యాణ్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు డైరెక్టర్ హరీష్ శంకర్ తన ట్విట్టర్ నుంచి ట్వీట్ చేయడం జరిగింది.

సెట్లో యాక్షన్ సన్నివేశాలలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ని చూసి తనకు చాలా గొప్పగా అనిపించిందని ట్వీట్ చేయడం జరిగింది. ఇక హరిహర వీరమల్లు చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తూ ఉన్నారు. హరిహర వీరమల్లు చిత్రాన్ని డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కూడా ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా మొగలుల కాలంనాటి కథతో ఒక బందిపోటు పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండడం గమనార్హం.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రమని చెప్పవచ్చు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తున్నది. కీలకమైన పాత్రలో మరొక హీరోయిన్ నోరా ఫతేహి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సంగీతాన్ని మాత్రం ఎం ఎం కీరవాణి అందిస్తూ ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడనే వార్తలపై క్లారిటీ వచ్చినట్టే అని అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest