బెంగుళూరు బ్యూటీ అనుష్క శెట్టి ఫ్యాన్స్ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అసలే ఈ అమ్మడు ఇటీవల సినిమాలు చేయడం బాగా తగ్గించింది. దీంతో అనుష్క లో మునుపటి జోరు కనిపించదని అందరూ భావించారు. కానీ ఈ అమ్మడు మళ్ళీ వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.
ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో అనుష్క ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనుష్కకు 48వ చిత్రం ఇది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి మహేష్ పి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశ లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.
అయితే ఈ సినిమా అనంతరం అనుష్క.. ప్రముఖ హీరోయిన్ అమలా పాల్ మాజీ భర్త, కోలీవుడ్ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ తో చేయబోతుందట. ఇటీవల విజయ్ ఓ కథను అనుష్కకు వినిపించగా.. అది ఆమెకు బాగా నచ్చి వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇదో లేడీ ఓరియెంటెడ్ సినిమా అని.. ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంతో అనుష్క ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు.