నీ భార్య‌తో నాకు ఎఫైర్ అంటూ లింక్ పెట్ట‌కు… ప‌రువు న‌ష్టం దావాకు ఆ న‌టుడు రెడీ…!

ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారిన పేర్లు రాజీవ్ సేన్, చారు ఆసోపా గత రెండు రోజులుగా వీరిద్దరి విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఇక రాజీవ్ సేన్ ఎవ‌రో కాదు మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ సుస్మితాసేన్‌కు స్వ‌యానా సోద‌రుడు అన్న విష‌యం తెలిసిందే. తప్పు చేసింది నువ్వే అంటే నువ్వే అని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ. రాజీవ్ సేన్ తన భార్య ఆసోపానీ మీడియా ముఖంగా నువ్వు నటుడు కరణ్‌ మెహ్రాతో రొమాన్స్ చేసింది నిజం కాదా ? అని తన భార్యను నిలదీశాడు.

Karan Mehra denies affair with Charu Asopa, wants to sue Rajeev Sen |  Bollywood - Hindustan Times

ఇప్పుడు ఈ విషయంపై హిందీ బిగ్ బాస్ పదో సీజన్ కంటెస్టెంట్, బుల్లితెర నటుడు కరణ్‌ మెహ్రా స్పందిస్తూ నీ భార్య నాతో రొమాన్స్ చేయటం అసలు నువ్వు చూసావా.. ఏం మాట్లాడుతున్నావ్ నీకసలు అర్థమవుతుందా రాజీవ్ ? నీ భార్యను నేను 10 సంవత్సరాల క్రితం ఓసారి కలిశాను. తర్వాత నేను ఢిల్లీ వెళ్లిపోయాను. మళ్లీ రెండు సంవత్సరాల క్రితం జూన్‌లో ఓ మూవీ ప్రమోషన్ ఈవెంట్లో నీ భార్యతో మాట్లాడాను అంత వ‌ర‌కే అని చెప్పాడు.

Rajeev Sen is lying: Charu Asopa on being accused of having an affair with Karan  Mehra - Hindustan Times

తాను ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పటివరకు నేను నీ భార్య మొహం చూడలేదు..! నువ్వు ఇప్పుడు నాపై చెత్త ఆరోపణ చేయడం నాకు బాధగా అనిపిస్తుంది. నేను నీపై పరువునష్టం దావా వేస్తానని చెప్పుకొచ్చాడు. గత రెండు సంవత్సరాలుగా ఈ జంట గొడవ పడుతూనే ఉన్నారు. ఈసారి మాత్రం విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మ‌ధ్య‌లో వీరు ఓ సారి రాజీప‌డి క‌లిసున్నా ఇప్పుడు మాత్రం చారు విడాకులే కావాలంటోంది.

Share post:

Latest