సినిమాల్లోకి రాకముందు కాంతార హీరో ఏం చేసేవారో తెలుసా..?

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా నటుడు రిషబ్ శెట్టి గురించి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కనడ చిత్ర పరిశ్రమ నుంచి స్వయంగా ఆయన దర్శకత్వంలోనే ఆయనే హీరోగా వచ్చిన చిత్రం కాంతారా. ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకుంది. విడుదలైన ఈ చిత్రం అన్ని భాషలలో మంచి విజయాన్ని అందుకుంది.కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించగా ఏకంగా ఈ సినిమా ఇప్పుడు రూ.300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా రిషబ్ శెట్టి ఈ సినిమా సక్సెస్ను బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.

Rishab Shetty News: Rishab Shetty prays at Mumbai's Siddhivinayak Temple  following Kantara's success - The Economic Timesఈ సినిమా సక్సెస్ తో రిషబ్ శెట్టి ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ.. కెరియర్ లో జరిగిన కొన్ని విషయాలను సైతం తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తను ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో ఉద్యోగాలు చేస్తూ ఉండేవాడినని తెలియజేశారు. ఇంట్లో తన తండ్రిని డబ్బులు అడగలేక చిన్నచిన్న పనులు చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడిని తెలియజేయడం జరిగింది. డిగ్రీ చదువుతున్న సమయంలో సినిమాలకు వెళ్లాలన్న నాన్న డబ్బులు అడగలేక కూలి పనులకు వెళ్లి డబ్బులు సంపాదించాలని తెలిపారు.

Rishab Shetty's Wife Shares Glimpses of Their Diwali Celebration in Latest  Postఅలా ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2004 నుంచి 2014వ సంవత్సరం వరకు మినరల్ వాటర్ ప్లాంట్ లు వాటర్ క్యాన్లు అమ్ముతూ బిజినెస్ చేశానని తెలిపారు. అదేవిధంగా పలు హోటల్లో బిజినెస్ లో కూడా తాను చేశానని తెలిపారు. ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతూ తన అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఇండస్ట్రీలో క్లబ్ బాయ్ ,స్పాట్ బాయ్ ,అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశానని తెలిపారు. మొదటిసారిగా 2016లో తుగ్లక్ అనే సినిమాలో చిన్న పాత్రలు నటించారని తెలిపారు. ఇక ఆ తర్వాత 2017 లో రక్షిత శెట్టి తనకు డైరెక్టర్గా అవకాశం ఇచ్చారని తెలిపారు.

Share post:

Latest