కృష్ణ – లక్ష్మీ ల మధ్య వున్న బంధం ఏంటో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి నటులలో సూపర్ స్టార్ గా పేరుపొందిన కృష్ణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు గా పేరుపొందారు.తెలుగు తెరపై యాక్షన్ సినిమాలలో డిఫరెంట్ స్టైల్ లో కనిపించిన కృష్ణ.. కొన్ని మేకింగ్ స్టైల్స్ కృష్ణకు మాత్రమే సెట్ అవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు ఏదైనా కొత్తదనం పరిచయం చేయాలంటే అది కేవలం కృష్ణ వల్లే సాధ్యమవుతుందని ఇండస్ట్రీలు ఎంతో మంది ప్రముఖులు సైతం తెలియజేస్తూ ఉంటారు.

BA Raju's Team on Twitter: "Superstar #Krshna garu KSR Das Direction lo  natinchina Superhit Bond Film #Jamesbond777 completes 47 years today  (03/12/1971) https://t.co/im4rL3gmiL" / Twitter
కృష్ణ సినిమాలలో ఎక్కువగా గుర్రంపై సన్నివేశాలు.. గుర్రంపై కొన్ని పాటలు కూడా చిత్రీకరిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే కొన్ని గ్రాఫిక్ సంస్థలు వచ్చి గుర్రం ఎక్కకుండా ఎక్కినట్లుగా చూపిస్తున్నారో అప్పటినుంచి గుర్రాల హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. కానీ అప్పట్లో మాత్రం గుర్రంతో సన్నివేశాలు చేయాలి అంటే కచ్చితంగా గుర్రం ఎక్కి సవారి చేయాల్సిందే. ఎవరైనా సరే గుర్రం ఎక్కడం అనేది అది మామూలు విషయం కాదు. గుర్రం ఎప్పుడు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తుందో ఎవరుమో చెప్పలేము ముఖ్యంగా షూటింగ్ సమయంలో చుట్టూ ఉండే జనాలకు అది బెదిరిపోకుండా చూసుకోవాలి ముఖ్యంగా అప్పట్లో తగిన జాగ్రత్తలు కూడా ఎక్కువగా ఉండేవి కాదట.

కానీ గుర్రపు సన్నివేశాలు చేయాలి అంటే గుర్రపు సవారీ అలవాటు చేసుకోవాల్సిందే.అయితే అప్పట్లో ఏదో ఒక గుర్రం సీన్లు చేయాలి అంటే గుర్రం వారికి అలవాటు పడితేనే..దాదాపుగా ఆ గుర్రం సన్నివేశాలు చిత్రీకరించే వారట. అలా ఒక గుర్రం కృష్ణకు బాగా మచ్చికైందట. అప్పట్లో పులి గోవిందా అనే వ్యక్తి సినిమాల షూటింగులకు గుర్రాలను సప్లై చేసేవారు. అయితే అతని దగ్గర ఉన్న లక్ష్మీ అని గుర్రాన్ని మాత్రమే కృష్ణ సినిమాలలో ఎక్కువగా ఉపయోగించే వారట. ఒకవేళ ఏ హీరో కూడా సినిమా షూటింగ్ కు గుర్రం ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా కృష్ణను అడిగి ఓకే చెబుతేనే ఇచ్చేవారట. ఇలా లక్ష్మీకి కృష్ణకి ఉన్న బంధం వల్ల ఆ గుర్రాన్ని తన సొంత ఖర్చుతోనే అన్ని పనులు చేయించే వారిని సమాచారం.