హీరోయిన్ రష్మిక పేదరికం గురించి తెలుసా? అద్దె డబ్బులు కట్టలేని స్థాయినుండి!

టాలీవుడ్ క్యూటీ హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే బడా స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక. దాంతో వరుస అవకాశాలు అమ్మడిని వెతుక్కుంటూ వస్తున్నాయి. మొదటి సినిమా ‘ఛలో’ సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన రష్మిక ఆ తరువాత తిరిగి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే బేసిగ్గా కన్నడ హీరోయిన్ అయినటువంటి రష్మికకు ఈ స్థాయి ఒక్క రోజులో రాలేదు. ఆమె కటిక పేదరికంనుండి బయటకి వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే అలాంటి కష్టాల నుండే కొందరికి ఏదైనా సాధించాలి అన్న కసి, పట్టుదల ఉదయిస్తాయి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న రష్మిక కూడా అలానే కెరీర్లో ఎదిగారు. చిన్నతనంలో రష్మిక అత్యంత దుర్భరమైన పేదరికం అనుభవించారని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రష్మిక పేరెంట్స్ కి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా చుట్టుముడుతూ ఉండేవట. నెలాఖరున ఇంటి అద్దె కట్టే స్తొమత కూడా ఉండేది కాదట. దీంతో ఇంటి యజమానులు ఎప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయిస్తూ ఉండేవారట. ప్రతి 2 నెలలకు కొత్త ఇల్లు వెతుక్కోవడం వారి జీవితంలో నిత్యకృత్యం అయ్యేదట.

అంతేకాకుండా నిలువ నీడ కోసం వీధుల్లో తిరిగిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయట. ఇక ఈ విషయాలు చెబుతూ రష్మిక కన్నీటి పర్యంతం అయింది. పేరెంట్స్ తను ఏది అడిగినా కాదనేవారు కాదట. అయినప్పటికీ రష్మిక ఏమీ అడిగేది కాదట. ఎందుకంటే కనీసం ఒక బొమ్మ అడిగినా అది కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కావు అంటూ రోదిస్తూ చెప్పుకొచ్చింది. కాగా ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు రష్మికను ఓదారుస్తున్నారు.

Share post:

Latest