నాగచైతన్యకు రెండో పెళ్లి సలహా సమంతనే ఇచ్చిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది హీరోయిన్ సమంత. గడిచిన కొన్ని నెలల నుంచి సమంత నాగచైతన్య వ్యవహారం పైన పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రెండు రోజుల క్రితం సమంత ఆరోగ్యం సరిగ్గా లేదని విషయాన్ని తెలియజేసింది.దీంతో మరొకసారి సమంత ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడంతో అప్పటినుంచి వీరిద్దరి పైన పలు కామెంట్లు తో పాటు విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీరిద్దరూ విడిపోవడానికి ముఖ్య కారణం ఏంటి అనే విషయం మాత్రం ఇంకా సందిగ్ధంగానే ఉందని చెప్పవచ్చు.

Naga Chaitanya - Samantha Akkineni Relationship: Will They Get Divorced?  Tarot Card Reader Predicts-Naga Chaitanya - Samantha Akkineni Relationship:  Will They Get Divorced? Tarot Card Reader Predicts
మొదట ఏం మాయ చేసావే సినిమాతో పరిచయమైన ఈ జంట ఆ తర్వాత ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సమంత స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. దీంతో తనకంటూ ఒక గుర్తింపు రావడంతో నాగచైతన్య ప్రేమ గురించి బయట పెట్టింది. ఇక తర్వాత ఇరువురు కుటుంబాల కలయికత విరి వివాహం జరిగింది. వివాహమైన తర్వాత కూడా సమంత ఒకవైపు సినిమాలలో మరొకవైపు యాడ్స్, బిజినెస్ వంటివి ప్రారంభించింది.

Samantha's LAST photo with Naga Chaitanya from Valentine's Day will leave  every fan heartbroken
ఎంతోమంది స్టార్ నటీనటులు విడిపోయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ జంట విడిపోవడం అనేది జీర్ణించుకోలేకపోయారు. ఎంతోమంది వీరిద్దరిని కలుసుకోండి అంటూ పలు రకాలుగా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. సమంత, నాగచైతన్య ప్రస్తుతం ఎవరు లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సమంతకు అరుదైన వ్యాధి రావడంతో సమంత పై సినీ ప్రముఖులు సింపతి చూపిస్తూ ఉన్నారు. ఇక అభిమానులు సినీ ప్రముఖుల సైతం త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే సమంత నాగచైతన్యాను మరో పెళ్లి చేసుకోమని కోరిందని వార్తలు వినిపిస్తున్నాయి. సమంత ఆరోగ్యం అలా ఉన్నందువల్లే నాగచైతన్యకు సమంత అలాంటి సలహా ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇందులో నిజం ఎంతుందో మాత్రం తెలియాల్సి ఉంది.

Share post:

Latest