ఎన్టీఆర్ సినిమా కోసమే కొరటాల శివ అతని దగ్గరకు వెళ్లారా..!!

డైరెక్టర్ కొరటాల శివ చివరిగా తెరకెక్కించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా లో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవి చూసింది.ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఎన్టీఆర్ 30వ సినిమా అనౌన్స్మెంట్ చేసి అందుకు సంబంధించి ఒక డైలాగ్ మోషన్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి పలు కారణాల చేత కాస్త ఆలస్యం అవుతూనే ఉంది. ముఖ్యంగా కథ విషయంలో ఎన్టీఆర్ చాలా రకాల మార్పులు చేశారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

Koratala Siva NTR30: NTR30 నుండి సాలిడ్ అప్డేట్.. ఈ రకంగా సర్ప్రైజ్  చేస్తున్న మేకర్స్అయితే కథలు ఎన్నో సార్లు మార్పులు చేసిన కూడా ఎప్పుడూ కూడా కొరటాల శివ వెనక్కి తగ్గకుండా మార్పులు చేసుకుంటూనే ముందుకు వెళుతున్నారని సమాచారం. ఇక మొత్తం మీద ఈ స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత ఇప్పుడు షూటింగ్ మొదలు కావడానికి సిద్ధంగా ఉంది అన్నట్లుగా వార్త వినిపిస్తున్నాయి అయితే ఈ క్రమంలో మ్యూజిక్ విషయంలో కూడా ముందే ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని మ్యూజిక్ డైరెక్టర్ తో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి మొదట దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి.

Koratala siva Latest Stories at Filmify Telugu, Koratala siva Updates, And  Many More From Koratala siva - Filmify Teluguకానీ ఆ తర్వాత ఫ్యాన్స్ డిమాండ్ మేరకు యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ తో అయితే మ్యూజిక్ బాగా సెట్ అవుతుందని భావించడంతో యూనిట్ సభ్యులు కూడా ఈ విషయాన్ని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక గతంలో కూడా ఎన్టీఆర్ అరవింద సమేత కు సంగీతాన్ని అందించాల్సి ఉండగా అప్పుడు కొన్ని కారణాల చేత ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. మరి ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ కు సంబంధించి ఒక ఫోటో కూడా వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా అనిరుద్, కొరటాల శివ కలిసి ఉన్న ఒక ఫోటో వైరల్ గా మారడంతో.. ఎన్టీఆర్ 30వ సినిమా కోసం మాట్లాడుతున్నారు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. మరి ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలుబడుతుందేమో చూడాలి.

Share post:

Latest