తెలుగులో పెద్ద సాహసమే చేస్తున్న ధనుష్.. హిట్ అవుతే మాత్రం రికార్డే!

ఈ రోజుల్లో తమిళ హీరోలు తమిళంలోనే సినిమాలు తీస్తూ తెలుగులో తీస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఇటీవలే దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన ‘ప్రిన్స్’ సినిమా గురించి కూడా చాలానే బిల్డప్ ఇచ్చారు. ఇదొక ద్విభాష చిత్రంగా మొదటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. ‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజీ డాన్’ అనే సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కాస్త పరిచయమైన శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ సినిమాతో మరింత దగ్గర కావాలనుకున్నాడు. ఏషియన్ మూవీస్ సునీల్ నారంగ్, సురేష్ ప్రొడక్షన్ అధినేత సురేష్ బాబు కలిసి నిర్మించిన సినిమా ఇది.

అంతేకాకుండా జాతిరత్నాలు సినిమా తరువాత అనుదీప్ కె.వి రూపొందించిన కూడా ఇది కావడం వల్ల ప్రిన్స్ సినిమాపై అందరికి మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ కొన్ని కారణాలతో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిన్స్ సినిమాను తమిళ్ లో తీసి, తెలుగులో డబ్బింగ్ చేసారు. ఈ విషయం ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. జాతిరత్నాలు వలె ఈ సినిమాలో కూడా సిల్లీ కామెడీనే ట్రై చేసాడు అనుదీప్. కానీ అది పూర్తి తెలుగు సినిమా కాకపోవడం వల్ల ప్రిన్స్ సినిమా ఎదురుదన్నింది. వారసుడు సినిమా పరిస్థితి కూడా అలానే ఉండొచ్చు.

ఇక ధనుష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్టార్‌’ సినిమా కూడా స్ట్రెయిట్ తెలుగు మూవీ అని చెబుతున్నారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదొక ద్విభాష చిత్రంగా ప్రకటిస్తున్నారు. టీజర్‌లో కూడా ధనుష్ స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. ఇక సినిమా మొత్తం చూసినప్పుడు ఇదొక తెలుగు సినిమా అనే ఫీలింగ్ రావడం, దానికి తగ్గ ఎఫర్ట్స్‌ని పెట్టడం ముఖ్యం. అలా ఉంటేనే తెలుగు సినిమా ఒక రేంజ్‌లో ఆడుతుంది. అంతేకాకుండా తెలుగులో ధనుష్ మార్కెట్ కూడా పెరుగుతుంది. ఏదేమైనా తెలుగులో ధనుష్ పెద్ద సాహసమే చేస్తున్నాడని చెప్పాలి. ఒకవేళ ఇతని స్ట్రెయిట్ తెలుగు మూవీ హిట్ అవుతే మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో రాంజానా సినిమా వలె అదొక రికార్డు క్రియేట్ చేస్తుంది.

Share post:

Latest