చీరాల సీన్ చేంజ్..వ్యూహాత్మక ఎత్తుగడ..!

గత ఎన్నికల్లో అంతటి వైసీపీ గాలిలో కూడా చీరాలలో మంచి మెజారిటీతో టీడీపీ గెలిచిన విషయం తెలిసిందే. కరణం బలరామ్ ఇమేజ్..టీడీపీ క్యాడర్ బలం వల్ల..చీరాల సీటు టీడీపీకి దక్కింది. అయితే అధికారం వైసీపీకి రావడంతో..పలు కారణాల వల్ల కరణం బలరామ్..టీడీపీని వదిలి వైసీపీ వైపుకు వెళ్లారు. ఇలా కరణం అటు వైపు వెళ్ళడం, అలాగే పోతుల సునీత సైతం వైసీపీలోకి వెళ్ళడంతో చీరాలలో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది.

దీంతో ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన యడం బాలాజీకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన ఎఫెక్టివ్ గా పనిచేయలేదు..ఆయన నిదానంగా పార్టీకి దూరం జరిగారు. దీంతో కొండయ్య యాదవ్‌ని ఇంచార్జ్‌గా పెట్టారు. ఈయన మొదట్లో అంత అనుకున్న విధంగా పనిచేయలేదు. కానీ నిదానంగా స్పీడ్ పెంచారు. కార్యకర్తలని కలుపుకునిపోతూనే..ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. అటు బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న ఏలూరి సాంబశివరావు సైతం..చీరాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి పనిచేశారు. దీంతో చీరాలలో టీడీపీ బలం కొంతమేర పుంజుకుంది.

చీరాలలో టీడీపీ గెలుపునకు కలసికట్టుగా పనిచేయాలి

పైగా వైసీపీలో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయి. ఎమ్మెల్యే కరణం బలరామ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీతల మధ్య అంతర్గత యుద్ధం నడుస్తోంది. దీని వల్ల వైసీపీకి రిస్క్ పెరిగింది. ఒకవేళ వీరిలో ఎవరికి సీటు ఇచ్చిన..మరొక వర్గం సహకరించే పరిస్తితి లేదు. ఇది పూర్తిగా వైసీపీకి మైనస్. అయితే టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలి. వైసీపీలో ఉన్న గ్రూపు తగాదాలని క్యాష్ చేసుకోవాలి.

ఆ దిశగానే కొండయ్యకు ఇటీవల చంద్రబాబు దిశానిర్దేశం చేశారు…అలాగే తాజాగా కొండయ్య..లోకేష్ సైతం భేటీ అయ్యి, నియోజకవర్గ పరిస్తితులని వివరించారు. ఇంకా కష్టపడి పంచేయాలని లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత పరిస్తితుల్లో వైసీపీకి కాస్త రిస్క్ ఉండగా, టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది..అదే సమయంలో జనసేనతో పొత్తు కూడా టీడీపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

Share post:

Latest