బాబు రాకతో కర్నూలులో సైకిల్ రాత మారేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించడానికి సిద్ధమయ్యారు. మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించి..అక్కడ పార్టీ పరిస్తితులని మెరుగు చేయాలని చూస్తున్నారు. వాస్తవానికి కర్నూలులో వైసీపీదే లీడింగ్. జిల్లాలోని 14 సీట్లు వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో జిల్లాలో వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలని బాబు చూస్తున్నారు. ఈ సారి కనీసం 5  సీట్లు పైనే గెలుచుకోవాలని అనుకుంటున్నారు.

ఈ క్రమంలోనే జిల్లా టూర్ పెట్టుకున్నారు..మొదట పత్తికొండలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు సిటీ నియోజకవర్గాలకు వెళ్తారు. ఎమ్మిగనూరులో భారీ సభ ఉంటుంది. ఈ సభని భారీ స్థాయిలో సక్సెస్ చేయడానికి జిల్లా టి‌డి‌పి శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సభ ద్వారా జిల్లాలో తమ బలం పెరిగిందని చూపించాలని అనుకుంటున్నారు. అయితే వాస్తవ పరిస్తితుల్లోకి వెళితే జిల్లాలో వైసీపీదే ఆధిక్యం ఉంది..కానీ గత ఎన్నికల్లో ఉన్నంత బలం మాత్రం ఇప్పుడు లేదు.

పలు స్థానాల్లో టి‌డి‌పి పికప్ అయింది..బనగానపల్లే, కర్నూలు సిటీ, ఆలూరు, మంత్రాలయం, డోన్ లాంటి నియోజకవర్గాల్లో పార్టీకి బలం కనిపిస్తోంది. కానీ బాబు పర్యటిస్తున్న పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల్లో పార్టీ ఇంకా పికప్ అవ్వాలి. వాస్తవానికి ఈ మూడు చోట్ల టి‌డి‌పికి బలమైన నాయకులు ఉన్నారు. పత్తికొండ సీటు కే‌ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ చేతుల్లో ఉంది. కే‌ఈ శ్యామ్ ఈ నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి పాజిటివ్ లేదు. అలా అని టి‌డి‌పికి పాజిటివ్ కనిపించడం లేదు.

అటు ఎమ్మిగనూరులో జయనాగేశ్వర్ రెడ్డి ఉన్నారు..ఆయన కూడా ఇంకా వెనుకబడి ఉన్నారు. అటు ఆదోనిలో సీనియర్ నేత మీనాక్షి నాయుడు ఉన్నారు. ఈయన ఇంకా పికప్ అవ్వాల్సి ఉంది. మరి బాబు పర్యటన ద్వారా కర్నూలు జిల్లాలో టీడీపీ రాత మారుతుందేమో చూడాలి.

Share post:

Latest