మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో రవితేజ నటిస్తున్నారు.రవితేజకు జోడిగా కేథరిన్ నటిస్తూ ఉన్నది. ఇలా ఇంతమంది నటిస్తున్నారు కనుకే ఈ చిత్రానికి మంచి హైప్ ఏర్పడుతోంది. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదల చేయగా మంచి పాపులారిటీ సంపాదించింది.
ఇక రవితేజ ఈ చిత్రంలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఈ చిత్రానికి సంబంధించి పలు అప్డేట్లను అందిస్తూ ఉంది చిత్ర బృందం. ఇప్పుడు తాజాగా ఒక లిరికల్ వీడియోతో ఒక పాటను రిలీజ్ చేయడం జరిగింది.ఈ పాటకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా బాస్ పార్టీ అంటూ సాగే మాసివ్ పార్టీ ఐటెం సాంగ్ కు ఊర్వశి రౌతేలా ను ఎంపిక చేయడం జరిగింది.
ఇక చిరంజీవి ఇందులో సిల్క్ చొక్కా గళ్ళ లుంగి ధరించి ఈ పాటలు మాసివ్ స్టెప్పులతో అదరగొట్టేస్తున్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ పాట థియేటర్లలో అభిమానులతో డ్యాన్స్ చేయించేలా ఉందని అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిరంజీవి ఈ పాటలో గతంలో తను నటించిన ముఠామేస్త్రి సినిమాలో ఉన్నట్లుగా కనిపిస్తున్నారంటూ అభిమానుల సైతం తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి లిరికల్ వీడియో వైరల్ గా మారుతోంది.