చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి బిగ్ అప్డేట్..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరిగా గాడ్ ఫాదర్ సినిమాతో పరవాలేదు అనిపించుకున్న చిరంజీవి ఇప్పుడు తాజాగా వాల్తేరు వీరయ్య అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు హీరోయిన్గా శృతిహాసన్, కేథరిన్ నటిస్తున్నారు. ఇక స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా నటిస్తూ ఉన్నది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తూ ఉన్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక అప్డేట్ వెలువడింది వాటి గురించి తెలుసుకుందాం.

దేవిశ్రీప్రసాద్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన గత సినిమాలోని పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఈ నేపథ్యంలోని వాల్తేరు వీరయ్య సినిమా నుంచి క్రేజీ అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు నిన్నటి రోజున చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎట్టకేలకు క్రేజీ అప్డేట్ రానే వచ్చింది. ఈ విషయం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉన్నది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. బాస్ పార్టీ అంటూ సాగే ఈ పాట ప్రోమోను విడుదల చేశారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ఫుల్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

ఇక చిరంజీవి ఇవే కాకుండా భోళా శంకర్ తదితర చిత్రాలలో బిజీగా ఉన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా వచ్చే యేడాది సంక్రాంతి బరిలో దించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే సంక్రాంతికి బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా కూడా విడుదల కాబోతోంది. మరి ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి మరి.

Share post:

Latest