కేవలం హరికృష్ణ కోసమే బాలయ్య ఆ చిత్రాన్ని చేశారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఏ ఇండస్ట్రీలో నైనా సరే కథ ఒక హీరోని ఊహించుకొని మరొక హీరోతో చేసిన సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక కొన్ని సినిమాలు కథ విన్నప్పుడు లేదా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆ రన్ అవుట్ ఫుట్ చూసి దర్శక నిర్మాతలకు ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అని ముందుగానే చెప్పేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కొన్ని అంచనాలు తలకిందులు అవుతాయని చెప్పవచ్చు. అయితే ఇలా తమకి కూడా జరిగింది అంటూ కొంతమంది స్టార్స్ మీడియా ముందుకు వచ్చి చెప్పిన సంఘటనలు చాలానే చూశాము.. అలాంటి అనుభవం నందమూరి బాలకృష్ణకు కూడా ఒకసారి ఎదురైనదట.

Tiragabadda Telugubidda Telugu Full Movie || Balakrishna, Bhanu Priya -  YouTube

ఇక అసలు విషయంలోకి వెళ్తే బాలయ్య ఆ సినిమా చేస్తే చూస్తారో లేదో అనే సందేహం ఉన్న కానీ చేయక తప్పలేదని తెలుస్తోంది. ఇంతకీ ఏమిటా చిత్రము అంటే బాలయ్య కెరియర్లో 1980లో సాలిడ్ చిత్రాలు చాలానే విడుదలయ్యాయి. అలాంటి వాటిలో తిరగబడ్డ తెలుగు బిడ్డ అనే సినిమా ఆడదని ముందుగానే తెలిసిన బాలయ్య చేయక తప్పలేదట.ఈ చిత్రాన్ని డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు తేజస్వి ప్రొడక్షన్ బాలయ్య అన్నయ్య నందమూరి హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Nandamuri Balakrishna pays last respects to late brother Harikrishna, final  rites to be held on Thursday. Watch videos - Hindustan Timesఈ చిత్రానికి కథా మాటలు పరుచూరి బ్రదర్స్ అందించారు. ఈ సినిమాకి నందమూరి బాలకృష్ణ అన్నయ్య నందమూరి మోహన్ కృష్ణ కెమెరామెన్ అవడం గమనార్హం. హీరోయిన్ గా భానుప్రియ ఎంపిక అయింది. 1988 మే 11న విడుదలైన ఈ చిత్రం బాలయ్య అనుకున్నదే ఈ సినిమా నెగటివ్ గా రావడం జరిగింది. అన్నయ్య హరికృష్ణ కి ఈ కథ మీద నమ్మకం ఉండడంతో మొదట బాలయ్య వద్దని చెప్పిన ఆయన అంతగా చెప్పడంతో అన్నయ్య మాటకు అడ్డు చెప్పకుండా బాలయ్య ఈ సినిమాలో నటించారు. ఈ విషయాన్ని బాలకృష్ణ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.

Share post:

Latest