టాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న అవతార్2 ఫ్రీ రిలీజ్ బిజినెస్.. కళ్ళు చెదిరే డీల్..!

అవతార్.. ఇది హాలీవుడ్ సినిమా నే కావచ్చు.. ఇంగ్లీష్ లో మాత్రమే తెరకెక్కించవచ్చు.. కానీ డబ్బింగ్ తో ప్రతి భాషలో రిలీజ్ అయ్యి.. అందరినీ ఎంతో విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు అందరినీ మరో లోకంలోకి తీసుకెళ్ళిపోయింది. విజువల్ వండర్ కు కేరాఫ్ అడ్రస్ గా ఈ సినిమా నిలుస్తుంది. ఈ సినిమా ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ సినిమాను ప్రతి భాష వారు తమ రీజనల్ సినిమాగా భావించి రిపీటెడ్ గా చూసే సినిమాలు లిస్టులో చేరిపోయింది.

James Cameron threw out Avatar 2's script after a year of writing! Here's why - BusinessToday

ఇక ఇప్పుడు తాజాగా అవతార్ పార్ట్ 2 రిలీజ్ కు సిద్ధమవుతుంది.. ఈ సినిమా కూడా దిమ్మ తిరిగే రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. ఇప్పుడు మన తెలుగు చిత్ర పరిశ్రమలో అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 100 కోట్లను దాటేసింది. మోస్ట్ అవైటెడ్ మూవీ గా జేమ్స్ కామెరూన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఈ సినిమాకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ అందరినీ అవాక్‌ అయ్యేలా చేసింది .

Share post:

Latest