ఆ టైంలో చైతన్య ను చూస్తే ఏడుపు వచ్చేసింది.. నాగార్జున సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ స్టార్ హీరోగా ఫేమస్ అయిన అక్కినేని నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే . సినీ కెరియర్ పరంగా రిమార్క్ లేని విధంగా దూసుకుపోతున్న నాగార్జున ..ఇప్పటికి తన కొడుకులకి కాంపిటీషన్ ఇస్తూ హీరోగా సినిమాలు చేస్తున్నాడు . ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటివరకు నాన్న రేంజ్ కి తగ్గ సినిమాలు చేయలేకపోయారు అక్కినేని కుర్రాళ్ళు. ఇప్పటికి జనాల్లో నాగార్జున – నాగచైతన్య – అఖిల్ ముగ్గురు వెళ్తే అందరూ నాగార్జున వద్దకి అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోగ్రాఫ్ లు, ఫోటో గ్రాఫ్ లు తీసుకుంటున్నారు.

అలాంటి మన్మధుడుగా పేరు సంపాదించుకున్నాడు నాగార్జున. కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తన ఫ్యామిలీ పై ,నాగచైతన్య పై షాకింగ్ కామెంట్స్ చేశారు . ఈ క్రమంలోని యాంకర్ “మీరు జీవితంలో ఎక్కువ బాధపడిన ఇన్సిడెంట్ ఏది”.. అని అడగ్గా ఎమోషనల్ అవుతూ ..”నాగచైతన్య చిన్నప్పుడు ఎక్కువగా రామానాయుడు గారి ఇంటి వద్దనే ఉండేవారు. సెలవులు వచ్చినప్పుడే నా దగ్గరకు వచ్చేవారు . అయితే సెలవులు అయిపోయిన తర్వాత నాగచైతన్య తన బుక్స్, సామాన్లు అన్ని సర్దుకునేసి వెళ్లిపోయేవాడు.. మళ్లీ సెలవులకు నా వద్దకు వస్తాడని తెలుసు.. కానీ ఎందుకో తను అలా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతుంటే నా మనసు చాలా బాధగా అనిపించేది”.

“ఏడుపు ఆపుకోలేక ఎన్నోసార్లు ఏడ్చాను. అస్సలు భరించలేకపోయాను . ఆ క్షణంలో నాగచైతన్య ని చూస్తే తెలియని ఫీలింగ్” అంటూ ఆయన చెప్పుకొచ్చారు . దీంతో నాగార్జున కామెంట్స్ వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే నాగార్జున మొదట రామానాయుడు కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు . నాగచైతన్య పుట్టిన తర్వాత విభేదాలు రావడంతో ఆయన ఆమెకు విడాకులు ఇచ్చేసి హీరోయిన్గా ఉన్న అమలను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అఖిల్ పుట్టాడు . కొంతకాలం తర్వాత నాగచైతన్యను నాగార్జున తీసుకొచ్చుకున్నాడు . త్వరలోనే ఎన్ సి 22 అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు నాగచైతన్య.

Share post:

Latest