విశ్వక్ సేన్ ప్లేసులో ఆ హీరో ని తీసుకొస్తున్న అర్జున్..!!

సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్లో నటుడు విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమాని అనుకున్నారు. అయితే విశ్వక్ సేన్ ప్రవర్తన వల్ల విసుగు చెందిన అర్జున్ విశ్వక్సేన్ తో వద్దనుకొని మరొక హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విశ్వక్ ను తీసేసిన ఈ ప్రాజెక్టులో టాలెంటెడ్ హీరో శర్వానంద్ తీసుకోబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీలు బాగా వినిపిస్తున్నాయి. శర్వానంద్ సక్సెస్ ఫెయిల్యూర్ అని తేడా లేకుండా ప్రతి సినిమాకు కూడా చాలా కష్టపడుతూ ఉంటారని చెప్పవచ్చు. రీసెంట్గా ఒకే ఒక జీవితం సినిమా తో వచ్చిన శర్వానంద్ మంచి విజయాన్ని అందుకున్నారు.

Vishwak Sen responds to Arjun's accusations: 'My concerns were never  heard'- Cinema express

ఇక అర్జున్ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాలో విస్వక్ ప్లేసులో శర్వానంద్ నటించబోతున్నట్లు వార్తలేనిపిస్తున్న అర్జున్ కూడా శర్వానందునే ఈ ప్రాజెక్టుకు ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇది వరకే శర్వానంద్ ఒక ప్రాజెక్టు ను ఒప్పుకోవడం జరిగింది.దీంతోపాటు అర్జున్ సినిమా కూడా చేయబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే మరొక లెవల్లో శర్వానంద్ కెరీర్ ఉంటుందని అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు. మరి ఈ సినిమాపై అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ వస్తుందో చూడాలి.

Sharwanand Hits and Flops Movies List

ఇక విశ్వక్ సేన్ సినిమా షూటింగ్ సమయానికి రాకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉండడమే కాకుండా కాల్ చేస్తే లిఫ్ట్ కూడా చేయకుండా సమాధానం కూడా సరిగ్గా చెప్పకుండా ఇర్ రేస్పాన్సిబుల్గా ఉండడంతో అర్జున్ ఫిలిం ఛాంబర్ కు కంప్లైంట్ చేసి ఈ సినిమా నుంచి తనని తొలగించబోతున్నట్లుగా కూడా తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వక్ సేన్ కూడా తాను చేసింది తప్పేనని తెలియజేస్తూ ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అర్జున్ విశ్వక్ ను ఓకే చేస్తారా శర్వానంద్ ను ఓకే చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Share post:

Latest