అను క్రష్.. ఆ బాలీవుడ్ స్టార్ హీరోనా..!

అయితే కొద్ది రోజులుగా అను ఇమ్మాన్యుయేల్ ఓ యంగ్ హీరోతో ప్రేమలో ఉందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.. ఆమె టాలీవుడ్ లో ఉన్న ఓ ఆగ్ర నిర్మాత కొడుకుతో డేటింగ్ చేస్తుందని, త్వరలోనే తన లవ్ మేటర్ ను బయటపెడుతుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అను తాజాగా నటించిన సినిమా ఊర్వశివో రాక్షసివో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈమె తన క్రష్ గురించి ఎవరు ఊహించని సమాధానం చెప్పింది.

Urvasivo Rakshasivo: ప్రేమ కాదంట.. అసలు ఆ టైటిలే కాదంట

తన క్రష్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అని.. నా జీవితం మొత్తం హృతిక్ ని నేను ప్రేమిస్తూ ఉంటానని కూడా అను చెప్పుకొచ్చింది. తనకు ఇష్టమైన హీరో అల్లుఅర్జున్ అని ఈ అందాల భామ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె నటించిన‌ ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రమోషన్ లో చాలా చురుగ్గా పాల్గొంటుంది . ఈ సినిమా ప్రమోషన్ లోనే తనకు సంబంధించిన వార్తలపై అను పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డేటింగ్ గురించి అడిగిన ప్రశ్నకు అను తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ ‘నేను ప్రేమలో ఉన్నాన లేదా అనే విషయం నాకే తెలియదు అంటూ. నేను ప్రేమలో ఉన్న విషయం మీకు ఏమైనా తెలిసిందా అంటూ నా బాయ్ ఫ్రెండ్ ఎవరో మీకు తెలిస్తే చెప్పండి అంటూ వ్యంగ్యంగా తన మీద వస్తున్న వార్తలను తిప్పుకొట్టింది’. ప్రస్తుతం అను వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest