తెలుగు సినిమాలని అడ్డుకుంటా మంటున్న తమిళులు.. కారణం..!!

ఒకవైపు దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయ్యి విజయాన్ని అందుకుంటూ సత్తా చాటుతుంటే.. మరొక పక్క టాలీవుడ్, కోలీవుడ్ లో లోకల్ నాన్ లోకల్ అంటూ వివాదం తారస్థాయికి చేరుతోంది. ఇప్పటికే సంక్రాంతి పండుగ వస్తున్న సమయంలో తెలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ చేయాలి అంటూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటించిన నేపథ్యంలో తమిళనాడులో కూడా లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అంటూ వివాదం నెలకొంది. ఈ క్రమంలోని తాజాగా నామ్ తమిళర్ కట్చీ అధినేత దర్శకుడు సీమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Prabhas's 'Adipurush' will battle with '#Mega154' and 'Varasudu' for  Sankranthi victory

తమిళ స్టార్ హీరో విజయ్ వారసి ( వారసుడు) సినిమాను తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కాకుండా అడ్డుకుంటే తమిళనాడులో తెలుగు సినిమాల రిలీజ్ ను అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇకపోతే సంక్రాంతికి విజయ్ వారీసు సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలపై తెలుగు నిర్మాతల మండలి అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే.అంతేకాదు 2023 సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు విడుదల చేయకూడదని తెలుగు నిర్మాతల మండలి ఒక లేఖను కూడా విడుదల చేసింది.

అయితే తెలుగు నిర్మాతల మండలి నిర్ణయాన్ని నామ్ తమిళర్ కట్చీ అధినేత సీమాన్ ఖండించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్, కాంతారా వంటి డబ్బింగ్ సినిమాలు తమిళనాడులో గొప్ప విజయం సాధించాయని గుర్తు చేశారు. అంతేకాకుండా తమిళనాడులో ఈ సినిమాల విడుదలకి తాము ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని కూడా ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కోలీవుడ్ సినిమాల విడుదల కి మాత్రం ఎందుకు తెలుగు నిర్మాతలు అభ్యంతరం చెబుతున్నారని దర్శకుడు సీమాన్ ప్రశ్నిస్తున్నారు. తెలుగు నిర్మాతల మండలి వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. లేని పక్షంలో తమిళనాడులో తెలుగు సినిమాల విడుదలను అడ్డుకుంటామని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంపై నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలి.

Share post:

Latest