యాంకర్ అనసూయ తగ్గనంటోంది.. 25 ఏళ్ళ భామలా ఫోజు కొడుతోంది చూడండి!

యాంకర్ అనసూయ గురించి తెలుగు కుర్రకారుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయిన మొదటి బొద్దుగుమ్మ యాంకర్ అనసూయ. బొద్దుగా ఉన్నప్పటికీ తెలుగు కుర్రాళ్ళకి ముద్దుగా మారింది ఈ అమ్మడు. అనతికాలంలోనే తెలుగునాట మంచి పేరు ప్రఖ్యాతలు గడించింది. అందంతోపాటు తన చురుకైన మాటలతో, కవ్వింపు చూపులతో అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఇంకేముంది కట్ చేస్తే ఏకంగా సినిమాలలో అవకాశాలు కొట్టేసింది.

ఇక సినిమాలలో వరుస అవకాశాలు రావడంతో ఈ అందాల భరిణి బుల్లితెరకు గుడ్ బై చెప్పేసింది. దాంతో వేరేదారిలేక అనసూయ ప్లేసులో సదరు షోకి రష్మీని తీసుకున్నారు. అనసూయ అంత కాకపోయినా, రష్మీ కూడా బాగానే అలరిస్తోంది. అది అలా ఉంటే అనసూయ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రస్తుతం అవి తెగ వైరల్ అవుతున్నాయి. సదరు ఫోటోలను చూసిన నెటిజన్లు పిచ్చెక్కి పోతున్నారు. ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే.. టీవీ రంగానికి పూర్తిగా గుడ్ బై చెప్పి ఇక సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ప్రాధాన్యం ఇస్తారని వినికిడి.

అందులో భాగంగానే తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో బోల్డ్ పాత్ర చేస్తున్నారట. ఈ వెబ్ సిరీస్ గాని రిలీజ్ అయితే సమంత వలె పాన్ ఇండియా స్థాయిలో బాగా పేరు సంపాదించవచ్చని ప్లాన్ వేసిందట. చూడాలి మరి, అమ్మడు ఆశలు ఆవిరి అవుతాయో లేక నెరవేరతాయో కాలమే నిర్ణయిస్తుంది. అనసూయ ‘కన్యాశుల్కం’ అనే వెబ్ సిరీస్‌లో నటించనున్నారని సమాచారం. ఈ వెబ్ సిరీస్ గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం ‘కన్యాశుల్కం’ ఆధారంగా తెరకెక్కనుంది. ఈ వెబ్ సిరీస్‌లో అనసూయ, మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్‌లో కనిపించనుందని తాజా టాక్.

Share post:

Latest