తెలంగాణ యాస‌లో అర్హ ముద్దు ముద్దు మాట‌లు.. వీడియో షేర్ చేసి బ‌న్నీ!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మ‌డు చిన్న‌త‌నంలోనే సోష‌ల్‌ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే అర్హ బర్త్‌డే నేడు.

ఈ స్టార్ కిండ్ నేడు 6వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా కూతురుకు సోషల్ మీడియా ద్వారా ‘హ్యాపీ బర్త్‌డే టు ది క్యూటెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్’ అంటూ బర్త్‌డే విషెస్ తెలిపిన బన్నీ.. అర్హకు సంబంధించిన ఓ క్యూట్ వీడియోను అందరితో పంచుకున్నాడు. ఈ వీడియోలో `కందిరీగలు కుడుతున్నాయ్‌..` అంటూ ముద్దు ముద్దుగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంది. అర్హ మాట‌ల‌కు బ‌న్నీ తెగ మురిసిపోయాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ క్ర‌మంలోనే అర్హ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న హిస్టారికల్ మూవీ `శాకుంతలం` సినిమా ద్వారా అర్హ‌ సినీ రంగ ప్రవేశం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో చైల్డ్ టెస్ట్ గా అర్హ కనిపించబోతోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Share post:

Latest