అదిరిపోతున్న ఆహా కామెడీ స్టాక్ ఎక్చేంజ్.. ప్రోమో వైరల్..!!

ఈ మధ్యకాలంలో ఓటీటి లో ప్రసారమవుతున్న షోలకు సినిమాలకు ఎక్కువగా పాపులారిటీ వస్తోంది. ఇక అల్లు అరవింద్ నిర్మాతగానే కాకుండా ఓటిటి గా ఆహా సంస్థను మొదలుపెట్టి బాగా సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రసారమయ్యే పలు షోలే కాకుండా సినిమాలు కూడా మంచి పాపులారిటీ అందుకుంటున్నాయి. ఈమధ్య డ్యాన్స్ ఐకాన్ అంటూ సరికొత్త ప్రయోగాత్మకంగా వాటిని చేపట్టారు.ఇది కూడా బాగానే సక్సెస్ గా కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా సరికొత్త ప్రోగ్రాం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.వాటి గురించి తెలుసుకుందాం.

ఇప్పటికే బాలకృష్ణ తో అన్ స్టాపబుల్ సీజన్ ని కూడా కొనసాగిస్తూ ఆహా మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇప్పుడు తాజాగా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అంటూ సరికొత్త కామెడీ షో ని ప్రారంభించారు. ఈ కామెడీ షో లో సుడిగాలి సుదీర్, దీపిక పిల్లి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇందుకు స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి జడ్జిగా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. అందుకు సంబంధించిన ఒక ప్రోమో నిన్నటి రోజున విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఎంతోమంది మాజీ జబర్దస్త్ కమెడియన్స్ కూడా పాల్గొన్నట్లు కనిపిస్తోంది.

ముఖ్యంగా ముక్కు అవినాష్, వేణు వండర్ ,హరి, జ్ఞానేశ్వర్ తదితరులు కూడా కనిపించారు. ఈ షో డిసెంబర్ 2 వ తేదీ నుంచి ప్రసారం కాబోతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావుపూడి ఇందులో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పవచ్చు. ఇక చివరిగా అనిల్ రావిపూడి ఎఫ్2 సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నారు. త్వరలోనే బాలయ్య తో కూడా ఒక యాక్షన్ మూవీని చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ కామెడీ ఎక్స్చేంజ్ కు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది.

Share post:

Latest