భర్తకు దూరమైన నటి స్నేహ.. కారణం ఇదే!

నిన్న మొన్నటి అందాల నటి స్నేహ గురించి తెలియని వారు వుండరు. ఈమె తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించింది. బేసిగ్గా బాలీవుడ్ బ్యూటీ అయినటువంటి ఈ భామ తెలుగునాట హీరోయిన్ గా మంచి మార్కులే కొట్టేసింది. దాంతో ఇక్కడ వరుస సినిమాలు చేస్తూ ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఓ దశలో అయితే ఈమె తెలుగు అమ్మాయినే అనుకొనేవారంతా. స్నేహ చీర కట్టు, బొట్టు కి ప్రత్యేకించి ఫ్యాన్స్ ఉండేవారు. అలా చీరకట్టులో మహాలక్ష్మిలా కనబడేది.

ముఖ్యంగా సినిమాలలో వల్గారిటి, ఎక్స్పోజింగ్, రొమాన్స్ వంటివాటికి దూరంగా వుంటూ హోంలీ పాత్రలు చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. దాంతో ఆమెకి ఫామిలీ విమెన్ పాత్రలు ఎక్కువగా వచ్చేయి. ఇక కొన్నాళ్ల క్రితం స్నేహ ప్రసన్నను పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఈ క్రమంలో ఇద్దరు బిడ్డల తల్లి అయిపోయింది. అప్పుడప్పుడు వీళ్ళకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ స్నేహ అభిమానులకి దగ్గరగా ఉంటోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ కావడం కొసమెరుపు.

స్నేహ తన భర్తకు దూరంగా ఉందని, వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలే దీనికి కారణం అంటూ గుసగుసలు గుప్పుమంటున్నాయి. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని ఇదే విషయం ఇపుడు మీడియాలో కూడా ప్రసారం అవుతున్నది. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగా స్నేహ ప్రసన్నల మధ్య దూరం పెరిగిందని, ఈ కారణంగానే స్నేహ, ప్రసన్నకు దూరంగా వేరే ఇంట్లో తన పిల్లలతో ఉంటుందని సమాచారం. ఇక ఈ విషయమై నెటిజన్లు కంగారు పడుతున్నారు. ముఖ్యంగా స్నేహ అభిమానులు తీవ్ర మనస్తానికి గురైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Share post:

Latest