యాక్సిడెంట్ తరువాత లైవ్‌లోకి వచ్చిన హీరోయిన్ రంభ… ఎమోషనల్ అయిన అందాల నటి!

అందాల తెలుగు తార రంభ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈమె స్వస్థలం విజయవాడ అనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఈమె అలనాటి ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా ద్వారా పరిచయం అయ్యింది. ఆ సినిమా తరువాత తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అనతికాలంలోనే తెలుగు చిత్రసీమలో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తరువాత తమిళనాటలో కూడా తన హవాని కొనసాగించింది. అంతేకాకుండా ఓ తమిళ దర్శకుడిని పెళ్లిచేసుకొని ప్రస్తుతం కుటుంబ జీవితానికి పరిమితమైంది.

ఇలా ఎలాంటివారికైనా కష్టసుఖాలు తప్పవు. ఆమె తాజాగా ఓ యాక్సిడెంటుకి గురైన సంగతి విదితమే. కారు ప్రమాదంలో ఆమెకే కాకుండా ఆమె కూతురు సాషాకి స్వల్ప గాయాలవ్వడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తన ప్రస్తుత పరిస్థితి, తన పాప పరిస్థితిని చెబుతూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది రంభ. అందరూ తన కూతురి కోసం ప్రార్థించండని వేడుకుంది. దాంతో రంభ షేర్ చేసిన పోస్ట్‌కు పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగింది. టాలీవుడ్, కోలీవుడ్ టాప్ స్టార్లంతా కూడా రంభ ఫ్యామిలీకి భరోసానిచ్చారు. సోషల్ మీడియాలో రంభ పోస్ట్‌కు కామెంట్లు పెట్టారు. ధైర్యంగా ఉండమని భరోసానిచ్చారు.

ఈ విషయమై, తాజాగా ఇన్ స్టాగ్రాం లైవ్‌లోకి వచ్చి తన సంతోషాన్ని తెలియజేసింది. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ… “మొదటి సారిగా ఇన్ స్టాగ్రాం లైవ్‌లోకి వచ్చాను. నా కోసం, నా కుటుంబం క్షేమం కోసం ఎంతో మంది ప్రార్థించారు. ఇప్పుడు మా ఫ్యామిలీ క్షేమంగా ఉంది. మా మంచి కోరిన అందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ రుణపడి ఉంటాను. సాషా కూడా కోలుకుంటోంది. నా ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఎంతో మంది మా కోసం ప్రార్థించారు. ఈ క్షణం ఎంతో సాధించిన ఫీలింగ్ కలుగుతోంది.” అంటూ రంభ ఎమోషనల్ అయింది.

Share post:

Latest