వైరల్ అవుతున్న నటి పూర్ణ హల్దీ ఫంక్షన్‌ ఫోటోలు.. ఎల్లో డ్రెస్‌లో అందాల విందు!

నటి పూర్ణ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో ‘అవును’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన పూర్ణ అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా హోమ్లీగా కనబడటంతో ఈమెని అచ్చ తెలుగు సినిమా హీరోయిన్ గా కీర్తించేవారు. కాగా ఇపుడు బుల్లితెర షో అయినటువంటి `ఢీ` ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కాగా ఈమె తాజాగా మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా తన మ్యారేజ్‌ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తుంది.

ప్రస్తుతం ఆమెకి సంబంధించినటువంటి హల్దీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సాంప్రదాయ చీరకట్టులో పూర్ణ బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. ఎల్లో డ్రెస్‌లో హోయలు ఒలికిస్తోంది. హల్దీ లుక్‌లో అందాల అప్సరసలా ఉంది నటి పూర్ణ. పూర్ణ దుబాయి బేస్డ్ ఇండియాకి చెందిన వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మే 31న వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని, జూన్‌ 12న వివాహం చేసుకున్నట్టు పూర్ణ ఈ సందర్భంగా తెలిపారు.

ఇటీవలే దీపావళి కానుకగా ఆమె తన మ్యారేజ్‌ ఫోటోలను పంచుకోగా వారం గ్యాప్‌తో ఇప్పుడు సోమవారం తన హల్దీ ఫంక్షన్‌ పిక్స్ ని షేర్‌ చేసి సర్ప్రైజ్ చేసింది. ఇకపోతే హీరోయిన్‌గా కెరీర్‌ని ప్రారంభించిన పూర్ణ, క్రమంగా బోల్డ్ అండ్‌ హాట్‌ రోల్స్ కనిపించి అభిమానుల మెప్పుని పొందింది. ఇకపోతే `ఢీ`షో ఆమెకి ఎంతటి మంచి పేరు తెచ్చిపెట్టిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ డాన్సు షోకి పూర్ణ జడ్జ్ గా చేసి మెప్పించింది. దీంతో మంచి అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల `అఖండ`, `దృశ్యం2`, `తలైవి` చిత్రాల్లో కీలక పాత్రల్లో మెరిసింది పూర్ణ.

Share post:

Latest