సీక్రెట్ ప్లేస్‌లో నిహారిక టాటూ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

నిహారిక కొణిదెల ఎవరో చెప్పాల్సిన పనిలేదు. బేసిగ్గా మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక తనదైన టాలెంట్ తో టాలీవుడ్లో హీరోయిన్ గా అడుగు పెట్టింది. వరుసగా ఓ మూడు సినిమాలు చేసింది. నటన పరంగా ఈమెకి మార్కులు పడినా, సినిమాలు సక్సెస్ కాకపోవడంతో కాస్త నెమ్మదించింది. ఆ తరువాత బుల్లితెరపైన కూడా ట్రై చేసింది. ఈ క్రమంలో పెళ్లి జరగడం కూడా అయిపోయింది. ఆ తరువాత ఈమె సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే నిహారిక సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది.

ఎప్పటికపుడు అప్డేట్స్ పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ముఖ్యంగా నిహారిక వెకేషన్లకు బయటకి వెళ్ళినపుడు తీసుకున్న ఫోటోలను షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఆ మధ్య టర్కీలో నిహారిక చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. మొదటి సారిగా బికినీలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఆ ఫోటోలను షేర్ చేసింది. అయితే ఇందులో నిహారిక వీపు మీదున్న టాటూ అందరికీ కనిపించి కనుల విందు చేసింది. అక్కడితో ఆగని ఆడియన్స్ ఆ టాటూ మీనింగ్ ఏంటి? అంటూ తెగ ఆలోచించేస్తున్నారు.

ఇకపోతే నిహారిక సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం వెబ్ సిరిస్‌లు నిర్మిస్తూ, మరోవైపు నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఆ మధ్య నిహారిక సోషల్ మీడియాకు కాస్త దూరంగా జరగడంతో ఎంత ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. భర్తతో విబేధాలు వచ్చాయని, మనస్పర్ధలు రావడంతో సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉందని నెటిజన్లు అడగడంతో నిహారిక దీనిపై పరోక్షంగా ఖండించింది. ఇక చైతన్య సైతం నిహారికతో ఉన్న ఫోటోలను షేర్ చేసి రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేశాడు.

Share post:

Latest