గొప్ప మనసు చాటుకున్న..వైవిఎస్ చౌదరి హీరో..!

నందమూరి హరికృష్ణ హీరోగా దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు ఆదిత్య ఓం. మొదటి సినిమాతోనే అదిరిపోయే హిట్ అవడంతో ఈ నార్త్ కుర్రాడు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత తెలుగు తో పాటు తమిళ్ హిందీ ఇతర భాషల సినిమాల్లో కూడా నటించాడు. కానీ ఆదిత్య స్టార్ హీరోగా రాణించలేకపోయాడు. ఆదిత్య‌ తెలుగులో దాదాపు 20 సినిమాలు కు పైగా నటించాడు.

A solo-act film on protecting our environment | Hindi Movie News - Times of  India

ఆదిత్య సినిమా రంగంలో పెద్దగా రాణించలేకపోయినా.. తన వంతు సేవారంగంలో మాత్రం తన ఔదార్యాన్ని చాటుకుంటూ అందర్నీ ఆదుకుంటున్నాడు ఆదిత్య ఓం. ఇప్పటికే ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేశారు. మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణకు చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఐదు గ్రామాలను దత్తత తీసుకొని దాదాపు 500 మందికి పైగా సహాయం అందించాడు ఆదిత్య ఓం. ఇక ఇప్పుడు తాజాగా అదే జిల్లాలో చెరుపల్లి, కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చాడు. ఇక వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఫీవర్ హాస్పిటల్‌కు సైతం అంబులెన్స్‌ను అందించాడు.

Aditya Om saving lives

ఇక ఆదిత్య ఓం తెలంగాణలోని గిరిజన ప్రాంతాలకు చాలా కాలం నుంచి తన చారుటబుల్ ట్రస్ట్ నుంచి సేవలు అందిస్తూ ఉన్నాడు. కోవిడ్ సమయంలో అక్కడ అంబులెన్స్ సేవలు లేకపోవడం చూసి, గ్రామాల్లో పాముకాటు కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అది చూసి చలించి పోయిన ఆదిత్య … ఆ గ్రామాలకు అంబులెన్స్ సేవలను అందించాలని అక్కడ ఉన్న రోటరీ క్లబ్ దానికి సంబంధించిన స్థానిక సంస్థల ఆర్థిక సాయంతో… ఆ గ్రామాలకు అంబులెన్స్ సేవలను అందించాడు. ఈ కార్యక్రమంలో అతని స్నేహితులు స్వచ్ఛంద సంస్థలు అందించిన సహాయం మరియు స్థానిక ప్రజల చూపిన చొరవ కారణంగా ఇది సాధ్యమైంది అంటూ ఆదిత్య ఓం పేర్కొన్నారు.