త్రివిక్రమ్‌తో సినిమా తీస్తే.. హీరో తన ఇంట్లో వారిని కోల్పోవాల్సిందేనా..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా అంటె హీరో లు అందరూ భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు త్రివిక్రమ్ తన డైరెక్షన్‌లో నటించిన హీరోలందరికీ మంచి హిట్స్ అందించాడు. త్రివిక్రమ్ సినిమా హిట్ అయినా కాకపోయినా అవి ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందుతాయి. ఆయన సినిమాలు వెండితెర మీద హిట్ అవ్వకపోయినా, బుల్లి తెర మీద అయినా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి.

ఇక అసలు విషయానికి వస్తే.. త్రివిక్రమ్ మూవీ ‘అ, ఆ’లో సెంటిమెంట్ ఎలాగైతే ఉంటుందో, అలానే ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఒక టైపు సెంటిమెంట్ ఆయన్ని.. ఆయనతో నటించే స్టార్ హీరోలను వెంటాడుతోందని నెటిజన్లు ఒక చర్చకు తేర లేపారు. వారి ప్రకారం, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించే హీరోల ఇంట్లో ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా ఆ హీరోల తండ్రులు చనిపోవడం అనేది కామన్ అయిపోయింది. నిజానికి అందరి హీరో విషయంలో అలా జరగలేదు. ఆయన సినిమాలో నటించిన స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్‌ల విషయంలో మాత్రమే ఈ సెంటిమెంట్ నిజమైంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ‘జల్సా’. ఈ మూవీ షూటింగ్ జరిగే సమయంలోనే పవన్ తండ్రి వెంకట్రావు మరణించారు. ఆ తరువాత ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చేసే సమయంలో ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణను రోడ్డు ప్రమాదంలో కోల్పోయాడు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్లతో త్రివిక్రమ్ మొదటిసారి కలిసి వర్క్ చేసినప్పుడు ఈ సంఘటనలు జరిగాయి. ఇక మహేష్‌తో కలిసి త్రివిక్రమ్ ఒక మూవీ చేయనున్న సమయంలోనే కృష్ణ మరణించారు.

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్, తరుణ్, నితిన్ లాంటి హీరోలు కూడా నటించారు. కానీ వారి విషయంలో మాత్రం ఈ సెంటిమెంట్ నిజం కాలేదు కదా? అని అందరూ అనుకోవచ్చు. కాకపోతే పవన్, ఎన్టీఆర్, మహేష్‌ల విషయంలో మాత్రం ఈ సెంటిమెంట్ వెంటాడింది. కేవలం ఒక్కరి విషయంలో మాత్రమే కాదు ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల విషయంలో ఈ సెంటిమెంట్ నిజమైంది. ఏదేమైనా ఇది ఒక ప్యూర్ కోయిన్సీడెన్స్ కావచ్చు కానీ ప్రేక్షకులు మాత్రం దీని గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు.

Share post:

Latest