శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌పై అలాంటి రూమర్స్.. క్లారిటీ ఇచ్చిందిగా..

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ వెండితెరపై హడావిడి చేయాల్సింది పోయి.. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజలతో రెచ్చిపోతుంది. హద్దులు మీరిన గ్లామర్ షోతో అందాలను ఆరబోస్తూ హైలెట్ అవుతున్న జాన్వీ కపూర్, ప్రస్తుతం తను నటించిన ‘మిలి’ సినిమాని థియేటర్స్‌లో రిలీజ్ చేసింది. ఈ హాట్ యాక్ట్రెస్ మలయాళంలో హిట్ అయిన హైలెట్ మూవీని హిందీలో మిలి పేరుతో రీమేక్ చేసింది. టైటిల్ రోల్ పోషించిన జాన్వీ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అప్పుడప్పుడు తన గ్లామర్ అందాల డోసెజ్ పెంచుతోంది. క్లివేజ్ షోస్, శారీ లుక్ అంటూ వయ్యారాలు పోతుంది.

ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ మధ్య జాన్వీ కపూర్, ఓర్హన్‌తో డేటింగ్‌లో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఎందుకంటే జాన్వీ ఓర్హన్‌తో కలిసి పార్టీలకి, వొకేషన్స్ తిరుగుతూ కనిపించింది. కాగా ఈ అమ్మడు తనపై వస్తున్న ఈ డేటింగ్ రూమర్స్ పై స్పందించింది. “ఓర్హాన్ నాకు చాలా కాలం నుంచి పరిచయం. అతను నా వెంట ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఓర్హాన్ లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అందుకే నేను ఓర్హాన్‌ను అంతగా నమ్ముతాను. మా ఇద్దరి మధ్య కేవలం మంచి స్నేహం మాత్రమే ఉంది” అని జాన్వీ తన రిలేషన్‌పై వచ్చే రూమర్స్ గురించి ఒక క్లారిటీ ఇచ్చేసింది.

అయితే అతడితో కాస్త రొమాంటిక్‌గా పిక్ దిగడంతో జాన్వీ నిజంగానే డేటింగ్ చేస్తుందేమో అని కొందరు నమ్మారు. పైగా ఓర్రీ జాన్వీ కపూర్ తండ్రి, నిర్మాత బోనీ కపూర్‌తో కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్. దానికి తోడు మిలీ స్క్రీనింగ్‌లోని వీడియోలు జాన్వీ, ఓర్రీల డేటింగ్ పుకార్లను మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ తన పెదవిప్పక తప్పలేదు.

Share post:

Latest