గెస్ట్ రోల్ కి అన్ని కోట్లు అందుకున్న వెంకీ మామ..!!

టాలీవుడ్ లో సీనియర్ హీరో వెంకటేష్ ఎన్నో చిత్రాలలో నటించారు. ఇక పలు చిత్రాలలో మల్టీస్టారర్ చిత్రాలలో కూడా నటించారు. ఇక తాజాగా ఓరి దేవుడా చిత్రంలో కూడా గెస్ట్ రోల్ పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోగా విశ్వక్ సేన్ నటించారు. ఈ సినిమా లో వెంకీ ,రాహుల్ రామకృష్ణ ల మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను సైతం నవ్వులు పూజించేలా ఉన్నాయి వాస్తవానికి వెంకీ నటిస్తున్నాడని వార్తలు రాగానే ఈ చిత్రానికి మంచి హైప్ ఏర్పడింది. ఇక రీసెంట్గా ఈ సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

Ori Devuda to feature Venkatesh Daggubati as god- Cinema express
ఇదంతా ఇలా ఉండగా ఈ చిత్రానికి వెంకటేష్ ఎంతటి రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయంపై ఇప్పుడు క్లారిటీ రావడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ కోసం మొత్తం ఐదు రోజులపాటు తన కాల్ సీట్ల కేటాయించారట. వెంకటేష్ అందుకు తగ్గట్టుగానే దర్శకనిర్మాతలు షూటింగ్ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఐదు రోజుల డేట్ల కోసం.. వెంకటేష్ అక్షరాల రూ.3 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి వెంకీ ఒక్కో సినిమా చేయడానికి దాదాపుగా రూ. 8 కోట్ల రూపాయల వరకు అందుకుంటున్నట్లు సమాచారం.

ఇక అలాంటిది గెస్ట్ రోల్ కోసం రూ.3 కోట్లు తీసుకున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో” కీసి కా భాయ్ కిసి కీ జాన్” అని చిత్రాలలో నటిస్తున్నారు. అలాగే నెట్ ఫ్లిక్స్ లో రామానాయుడు అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతున్నారు. వెంకీ ఘర్షణ సినిమా సీక్వెల్ తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Share post:

Latest