కళ్యాణ్ రామ్ కెరియర్ నే మార్చేసిన సినిమా లిస్ట్ ఇదే..!!

నందమూరి హీరో హరికృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్ మొదటిసారి చైల్డ్ ఆర్టిస్ట్ గా 1989లో బాలగోపాలుడు అనే సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 2003లో తొలిచూపులోనే అనే సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇకపోతే ఈయన సినిమాలు చేసింది తక్కువే అయినా ఎక్కువగా నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పటికే ఆయన కెరియర్లో ఎన్నో సినిమాలు వచ్చినా ఆయన కెరియర్ను మార్చింది మాత్రం కేవలం కొన్ని సినిమాలే కావడం గమనార్హం. మరి కళ్యాణ్ రామ్ సినీ కెరియర్ లో.. ఈయనను ఉన్నత స్థానానికి చేర్చిన ఆ సినిమాలేంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.Kalyan Ram plays 'do-gooder'

1.అభిమన్యు:
డైరెక్టర్ మల్లికార్జున్ రావు దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా దివ్య స్పందన హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం అభిమన్యు.. 2003 నవంబర్ 12వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో కళ్యాణ్ రామ్ కి హీరోగా మంచి గుర్తింపు కూడా లభించింది.

2.అతనొక్కడే:
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో సింధుతులాని హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా కళ్యాణ్ రామ్ కెరియర్ ను మార్చేసింది. ఇక 2005లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

3. లక్ష్మీ కళ్యాణం:
డైరెక్టర్ తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకేక్కిన చిత్రం లక్ష్మీ కళ్యాణం. ఇక ఈ సినిమా ద్వారానే కాజల్ అగర్వాల్ కూడా తెలుగు తెరకు పరిచయం అయింది . అంతేకాకుండా వీరిద్దరికి కూడా సినిమా పరంగా మంచి గుర్తింపును అందించిందని చెప్పవచ్చు.

4. హిట్:
దర్శకుడిగా మొదటిసారి అనిల్ రావిపూడి ప్రయత్నం చేసిన సినిమా హిట్.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని కళ్యాణ్ రామ్ కి కూడా మరింత ఇమేజ్ను తీసుకొచ్చింది.

ఇంకా వీటితోపాటు 118, రీసెంట్ గా వచ్చిన బింబిసారా వంటి సినిమాలు కళ్యాణ్ రామ్ కెరియర్ నే మార్చేశాయి.