చిరంజీవి శ్రీదేవి వదులుకున్న లవ్ స్టోరీ సినిమాలు ఇవే..!!

చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో సినిమాలు అంటే అప్పట్లో చాలా క్రేజీ కాంబినేషన్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు కూడా వచ్చాయి. అందులో రాణి కాసుల రంగమ్మ జగదేకవీరుడు అతిలోకసుందరి తదితర సినిమాలు విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇక చిరంజీవి టాలీవుడ్లో మెగాస్టార్ పేరు సంపాదించారు. వీరిద్దరూ కలిసి ఎంతో అద్భుతమైన నటనని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే వీరిద్దరూ కాంబినేషన్లో రావాల్సిన పలు చిత్రాలు కొన్ని కారణాల చేత ఆగిపోయాయి. ఆ సినిమాలు ఏవి వచ్చి ఉంటే ఎలా ఉండేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Did you know? How much Chiranjeevi and Sridevi were paid for Jagadeka Veerudu Athiloka Sundari
ఇక వీరిద్దరి కాంబినేషన్లో బ్యూటిఫుల్ చిత్రాలు వచ్చాయి . ఇక అశోక్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ప్రేమ కథ చిత్రం అభినందన ఈ సినిమాకు జీ బాబు కథను అందించారు. ఈ సినిమాకి పాటలు ఆత్రేయ అందించారు. ఈ సినిమా కథ రాయడంతోపాటు జీ .బాబుని ఈ చిత్రాన్ని నిర్మించారు .అయితే ఈ కథ పూర్తి అయిన తర్వాత మొదట చిరంజీవి,శ్రీదేవితో ఈ సినిమా చేయాలనుకున్నారట అంతేకాకుండా ఈ కథను శ్రీదేవికి వినిపించగా ఆమె కూడా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నది.

అయితే ఆ తర్వాత చిరంజీవి మేనేజర్ కి ఈ కథ చెప్పగా ఇది చాలా పాత లవ్ స్టోరీ అంటూ రియాక్షన్ ఇచ్చారట. దాంతో ఇదే కథను హీరో కార్తీక్ మరియు శోభనాకు తెలియజేయడంతో వీరిద్దరు ఓకే అనడంతో హీరో హీరోయిన్లుగా తీసుకువచ్చారు.ఈ చిత్రం మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో ఆగిపోయిన మరొక చిత్రం మౌనరాగం. ఈ సినిమాని శ్రీదేవి తన సొంత బ్యానర్ లోని నిర్మించింది కానీ కొన్ని కారణాలు చేత ఈ చిత్రం కూడా ఆగిపోయినట్లు సమాచారం. మరి ఈ సినిమాలు చేసి ఉంటే చిరంజీవి శ్రీదేవి కెరియర్ మరొక లాగా ఉండేదని చెప్పవచ్చు.