చీరకట్టులో చింపేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా… పరువాలు తెర!

బేసిగ్గా చీరకట్టులో మిల్కీ బ్యూటీ తమన్నా అందాలను వూహించుకోలేము. ఎప్పుడు టీషర్ట్స్, జీన్స్ లో కనబడే ఈ ముద్దుగుమ్మ సడెన్ గా చీరకట్టులో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? కానీ ప్రస్తుతం అలాగే చేసింది. అది మరెక్కడో కాదు, సోషల్ మీడియాలో. అవును, ఆమె తాజాగా ఓ చీరకట్టులో ఫోటో షూట్లో పాల్గొంది. ఆ తరువాత ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకుంది. ఇంకేముంది కట్ చేస్తే సోషల్ మీడియాలో ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు చీరకట్టులో మిల్కి అందాలను చూసి మతులు పోగొట్టుకుంటున్నారు.

అవును, దాదాపు ఓ రెండు దశాబ్దాలనుండి తమన్నా తెలుగు చిత్ర పరిశ్రమలో ఏక ఛత్రాధిపత్యం చేస్తోందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె తరువాత ఎందరో హీరోయిన్లు వచ్చారు. కానీ ఆమె స్థానాన్ని ఎవరు కదిలించలేకపోయారు. పెద్ద చిన్న అనే తేడాలేకుండానే అమ్మడు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కలర్, ఒడ్డు పొడుగు అమ్మడి సొంతం. ముఖ్యంగా సీనియర్ హీరోలకు ఆమె ప్రత్యామ్నాయంగా మారింది ఇపుడు. దాంతో చిరు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ సినిమాలలో ఈమెని బుక్ చేసుకుంటున్నారు.

ఇక చీరకట్టు ఫోటోలు విషయానికొస్తే, తాజాగా ఆమె ఓ చీరకట్టులో ఫోటో షూట్లో పాలుపంచుకుంది. బంగారు, సిల్వర్ వర్ణంలో మెరిసిపోతున్న ఆ చీరకట్టులో తమన్నా బంగారు లేడి పిల్లలాగా కనబడుతోంది. 35 ఏళ్ల వయస్సులోకూడా 25 లాగా కనబడుతోంది. దాంతో సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ చూసిన అమ్మాయిలు కుళ్ళుకుంటున్నారు. ఇక కుర్రాళ్ళయితే మతులు పోగొట్టుకొని, గిలగిలా కొట్టుకుంటున్నారు. ఇంకెందుకాలస్యం, మీరు కూడా ఇక్కడ వున్న ఫోటోలు తిలకించండి.