20 ఏళ్ల తర్వాత బాపట్లలో టీడీపీకి లక్!

ఎప్పుడో 1999లో చివరిసారిగా బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది..మళ్ళీ అప్పటినుంచి అక్కడ టీడీపీ గెలవలేదు. 1985, 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే బాపట్లలో టీడీపీ గెలిచింది. 2004 నుంచి బాపట్లలో టీడీపీకి కలిసిరాలేదు. 2004లో వైఎస్ వేవ్‌లో ఓడిపోయింది. 2009లో ప్రజారాజ్యం ఓట్లు చీలికతో ఓడింది. 2014లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే..బాపట్లలో సత్తా చాటలేకపోయింది. వైసీపీ నుంచి కోన రఘుపతి గెలిచారు.

ఇక 2019 ఎన్నికల గురించి చెప్పాల్సిన పని లేదు..జగన్ గాలిలో మరొకసారి బాపట్ల నుంచి కోన విజయం సాధించారు. ఇలా రెండుసార్లు వైసీపీ సత్తా చాటింది. అయితే గత రెండు ఎన్నికల్లో కూడా బాపట్లలో టీడీపీ గెలుస్తుందనే పాజిటివ్ చర్చ జరగలేదు. కానీ ఈ సారి మాత్రం పరిస్తితి మారింది. ఈ సారి బాపట్లలో టీడీపీకి పాజిటివ్ కనిపిస్తోంది. వరుసగా రెండుసార్లు గెలిచిన కోనపై..పెద్దగా పాజిటివ్ కనిపించడం లేదు. పైగా అధికారంలోకి వచ్చాక అభివృద్ధి తక్కువ కనిపిస్తోంది. అటు వైసీపీలో గ్రూపు తగాదాలు కనిపిస్తున్నాయి.

ఇక వరుసగా ఓడిపోతున్న సానుభూతి టీడీపీపై ఉంది. అదే సమయంలో ఇంతవరకు నాయకులు మారుతూ వచ్చారు గాని..బలమైన నాయకుడు బాపట్లలో కనిపించలేదు. కానీ ఇప్పుడు టీడీపీకి వేగేశన నరేంద్ర వర్మ రూపంలో బలమైన నాయకుడు దొరికాడు. నరేంద్ర ఇంచార్జ్‌గా వచ్చిన దగ్గర నుంచి బాపట్ల టీడీపీ శ్రేణుల్లో దూకుడు పెరిగింది. పార్టీ కార్యక్రమాలని విజయవంతంగా అమలు చేస్తున్నారు.

నిత్యం ఏదొక కార్యక్రమంతో నరేంద్ర జనంలో తిరుగుతూనే ఉన్నారు. ఊహించని విధంగా జనంలో పాజిటివ్ పెంచుకున్నారు. బాపట్ల ప్రజల్లో కూడా మార్పు కనిపిస్తోందని, ఇటీవల సర్వేల్లో తేలింది. ఇక్కడ టీడీపీకి గెలుపు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదే ఊపుతో నరేంద్ర పనిచేసుకుంటూ వెళితే..నెక్స్ట్ ఎన్నికల్లో బాపట్లో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా 20 ఏళ్ల తర్వాత బాపట్లలో టీడీపీకి పాజిటివ్ కనిపిస్తోంది.